తెలంగాణ

telangana

ETV Bharat / health

బాదం పాలను బయట తాగుతున్నారా? ఈసారి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి! - How To Make Badam Milk At Home

How To Make Badam Milk At Home : బాదం పాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ సమ్మర్‌లో చల్లగా ఉండే ఈ బాదం మిల్క్‌ను షాప్‌ నుంచి తీసుకువస్తే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకటికి రెండు గ్లాసులు తాగేస్తారు. అయితే, ఎప్పుడూ బయట నుంచి కొన్నవే కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేయండి.

How To Make Badam Milk At Home
How To Make Badam Milk At Home

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:37 PM IST

How To Make Badam Milk At Home : ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇంటా బయటా అల్లాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూల్​కూల్​గా ఉండే జ్యూసులు, డ్రింక్​లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్దిమంది బాదంపాలకు ఓటేస్తున్నారు. అయితే బయట షాపుల్లో లభించే బాదం పాలు అంత చిక్కగా ఉండవు. అలా అని వాటిని తాగలేకుండా కూడా ఉండలేరు. ఇక అలాంటి వారు టెన్షన్​ పడనక్కర్లేదు. ఇంట్లోనే ఈజీగా బాదం పాలను తయారు చేసుకోవచ్చు. ఇక ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ పాలను రెడీ చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒకటికి రెండు గ్లాసులు తాగడం పక్కా!. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

బాదం మిల్క్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • బాదం పప్పులు- ఒక కప్పు
  • జీడిపప్పు- అరకప్పు
  • చక్కర – 100 గ్రాములు (షుగర్​ ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం యాడ్​ చేసుకోవచ్చు)
  • యాలకుల పొడి -ఒక స్పూన్
  • పాలు – అర లీటర్
  • గార్నిష్​ కోసం - బాదం, జీడిపప్పు, పిస్తా పప్పును సన్నని ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • కుంకుమ పువ్వు - కొద్దిగా

బాదం పాలను ఎలా ప్రిపేర్‌ చేయాలి ?

  • ముందుగా బాదంపప్పులను, జీడిపప్పులను దోరగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని వేయించిన బాదం, జీడిపప్పు, కొద్దిగా కుంకుమపువ్వు వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నెలో చిక్కటి పాలను పోసి వేడి చేసుకోవాలి.
  • పాలు మరుగుతున్నప్పుడు యాలకుల పొడి, చక్కెర వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు పాలలోకి ముందుగా రెడీ చేసుకున్న బాదంపప్పు, జీడిపప్పుల పొడిని వేసి సన్నని మంట మీద 10 - 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. కలర్​ కోసం ఎల్లో ఫుడ్​ కలర్​ను చిటికెడు యాడ్​ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత పాల గిన్నెను పక్కను పెట్టి చల్లారనివ్వాలి. అలా చల్లారిన పాలను ఫ్రిజ్​లో గంట సేపు స్టోర్​ చేసుకోవాలి.
  • గంట తర్వాత పాలను బయటికి తీసి గ్లాసులోకి పోసి.. పైన సన్నగా కట్‌ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాపప్పును గార్నిష్ చేసుకుని తాగాలి.
  • మరి మీరు కూడా ఈ సారి బాదం పాలను బయటి నుంచి కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి! మీ పిల్లలకు సమ్మర్‌ సూపర్‌ డ్రింక్‌గా అందించండి.

బాదం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :

  • బాదం మిల్క్‌లో ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది.
  • అలాగే బరువు తగ్గడంలో బాదం మిల్క్‌ ఎంతో సహాయపడుతుంది.
  • రోజూ ఉదయాన్నే బాదంపప్పులను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
  • ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
  • పిల్లలు బాదం పాలను తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

నోరూరించే పులావ్​- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!

మీ కూరలో ఉప్పు ఎక్కువైందా? ఈ ఈజీ టిప్స్​తో అంతా సెట్!

మసాలా ఫిష్ ఫింగర్స్.. ఈ సండే అద్భుతమైన స్నాక్!

ABOUT THE AUTHOR

...view details