Home Remedies for Skin Allergy: ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ కామన్ అయ్యింది. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు కొన్ని ఆహార పదార్థాల వల్ల, క్రీమ్స్ కారణంగా, ఆర్టిఫిషియల్ నగల వల్ల చర్మం అలర్జీకి గురవుతుంది. ఈ కారణంతో స్కిన్‌పై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ముఖం, శరీరంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. అయితే కొన్ని అలర్జీలు మామూలుగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు ఇంటిలో లభించే కొన్ని పదార్థాలతో తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వేప: వేప అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున, ఇది చర్మ అలెర్జీలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి వేప నూనెను అలర్జీ ఉన్న ప్రదేశంలో రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. వేప నూనెను ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా చర్మ అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
2012లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అటోపిక్ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న పిల్లలకు వేప నూనె రాయడం వల్ల దురద, వాపు, ఎరుపుదనం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మద్రాస్ మెడికల్ కళాశాలలో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఎం. శివరాజ్ పాల్గొన్నారు. వేపనూనె స్కిన్ అలర్జీలను తగ్గించడమే కాకుండా చర్మం మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తులసి:తులసి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్కిన్ అలర్జీలను నయం చేయడంలో తులసి పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను తీసుకొని పేస్ట్ చేసి.. దద్దుర్లు, దురద ఉన్న ప్లేస్‌లో పేస్ట్‌ను అప్లై చేయమని. ఓ 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరి అంటున్నారు.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ స్కిన్ అలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉందని.. అనేక రకాల చర్మ అలర్జీల నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు. అలాగే చర్మం ఎరుపు, దురదను తొలగించడానికి ఇది సాయపడుతుందంటున్నారు.