తెలంగాణ

telangana

పాదాలు పొడిబారి చిరాగ్గా ఉందా? - ఇలా సింపుల్​గా మృదువుగా మార్చుకోండి! - Home Remedies For Dry Skin

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:40 AM IST

Home Remedies For Dry Skin : మన శరీరానికి కవచం స్కిన్. అది ఎల్లప్పుడు తేమగా ఉండటం చాలా అవసరం. కానీ.. కొంతమందికి సీజన్​తో సంబంధం లేకుండా చర్మం పొడిగా మారిపోతుంటుంది. క్రీమ్స్​, లోషన్లు వంటివి వాడినా పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. అలాంటి వారికోసం కొన్ని నేచురల్ టిప్స్ తీసుకొచ్చాం...

Natural Ways To Get Rid Of Dry Skin
Home Remedies For Dry Skin (ETV Bharat)

Natural Ways To Get Rid Of Dry Skin : సీజన్​తో సంబంధం లేకుండా కొంతమందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిగా మారి పొలుసుల్లా కనిపిస్తుంటుంది. దాంతో.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు క్రీమ్స్, లోషన్లు వంటివి యూజ్ చేస్తుంటారు. అయినా.. కొన్నిసార్లు మార్పు కనిపించకపోవచ్చు. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే.. మీకోసం కొన్ని అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాం. ఇవి ఫాలో అయ్యారంటే సులువుగా పొడిబారిన, పెళుసుబారిన చర్మాన్ని(Skin)తిరిగి మృదువుగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొబ్బరినూనె :చర్మం పొడి బారే సమస్యను తగ్గించడంలో కోకోనట్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరినూనె తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై స్మూత్​గా మర్దన చేసుకోవాలి. నైట్ అంతా పాదాలను అలాగే పడుకోవాలి. డైలీ ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ కాళ్లు తిరిగి మృదువుగా మారి మునుపటి అందాన్ని సొంతం చేసుకుంటాయంటున్నారు.

2016లో "జర్నల్ ఆఫ్ డెర్మటోలాజికల్ సైన్స్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పొడి చర్మం ఉన్న వ్యక్తులు 8 వారాలపాటు రోజుకు రెండుసార్లు కొబ్బరి నూనె రాసుకున్నాక వారి చర్మం మరింత తేమగా, మృదువుగా మారిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూపీ లక్నోలోని కె.జి. మెడికల్ కాలేజ్​కి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సీ. కె. పట్టేల్ పాల్గొన్నారు. కొబ్బరినూనెలోని ఔషధ గుణాలు చర్మం పొడిబారే సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని కనుగొన్నారు.

నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ : ఈ నేచురల్ స్క్రబ్​తో కూడా పాదాలను మృదువుగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో అరచెంచా నిమ్మరసం, రెండు చెంచాల చొప్పున ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని సమస్య ఉన్న చోట చర్మంపై అప్లై చేసి స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. ఆపై అరగంట ఆగి గోరువెచ్చని వాటర్​తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత పాదాలు బాగా ఆరాక మంచి క్వాలిటీ మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మంచి మార్పు గమనిస్తారంటున్నారు.

రోజూ ఈ ఫుడ్స్​ తింటే - ముసలితనమే రాదు - యవ్వనంతో మెరిసిపోతారు!

కలబంద : ఇందుకోసం ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకొని పాదాలకు అప్లై చేయాలి. అలా పావుగంటసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా డైలీ రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే పాదాలు మృదువుగా మారతాయని చెబుతున్నారు నిపుణులు.

తేనె :ఇది కూడా పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం కాస్త తేనె తీసుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసి ఐదు నిమిషాలు స్మూత్​గా మర్దన చేసుకోవాలి. ఆపై పావుగంట ఆగి గోరువెచ్చని వాటర్​తో కడుక్కోవాలి. ఇది పొడిబారి, పెళుసుగా మారిన చర్మాన్ని కోమలంగా మార్చడమే కాకుండా స్కిన్ యవ్వనంగా కనిపించేలా కూడా చేస్తుందంటున్నారు నిపుణులు.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు :

  • డైలీ స్నానం చేశాక పాదాలకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి.
  • అలాగే మరీ టైట్​గా ఉండే చెప్పులు, షూలు, సాక్సులు.. వంటివి ధరించకుండా జాగ్రత్త పడాలి.
  • ఎక్స్‌ఫోలియేషన్‌కి ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోవద్దు.
  • వీటితో పాటు కాళ్లు, పాదాలు ఎక్కువ వేడిగా ఉన్న వాటర్​తో కడగకుండా చూసుకోవాలి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details