తెలంగాణ

telangana

ETV Bharat / health

బిగ్ అలర్ట్ : మీరు వాడే టూత్​పేస్ట్ గుండె జబ్బులకు దారి తీస్తుందట! - ఎలాగో తెలుసా? - Toothpaste Side Effects

Toothpaste And Chewing Gum Side Effects : ప్రస్తుత రోజుల్లో చాలా మందిని గుండె జబ్బులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, సాధారణంగా అధిక బరువు, హై కొలెస్ట్రాల్, హై బీపీ వంటి సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్​కు దారితీస్తాయని చాలా మందికి తెలుసు. కానీ, మీరు ఉదయం బ్రష్ చేయడానికి యూజ్ చేసే టూత్​పేస్ట్ వల్ల గుండె సమస్యలు వస్తాయని మీకు తెలుసా? పూర్తి వివరాల కోసం స్టోరీ చదవండి.

Toothpaste And Chewing Gum Side Effects
Side Effects Of Toothpaste (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 1:14 PM IST

Side Effects Of Toothpaste And Chewing Gum :ఈరోజుల్లో చాలా మంది రకరకాల కారణాలతో గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏదో ఒక దశలో గుండెపోటు అనివార్యం అనేట్టుగా తయారయ్యాయి ప్రస్తుత పరిస్థితులు! ఇందుకు ప్రధాన కారణాలుగా.. మారిన జీవనశైలితోపాటు తినే తిండి, లోపించిన శారీరక శ్రమ, ఒత్తిడి వంటివి కనిపిస్తున్నాయి. అయితే, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. డైలీ మార్నింగ్ పళ్లు తోమకోవడానికి వాడుతున్న టూత్​ పేస్ట్(Toothpaste), రిలాక్సేషన్ కోసం నమిలే చూయింగ్ గమ్ కూడా గుండె జుబ్బులకు దారితీస్తుందట. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. మీరు వింటున్నది నిజమే కొన్ని పరిశోధనల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. అసలు, టూత్​పేస్ట్, చూయింగ్ గమ్​.. హార్ట్ ప్రాబ్లమ్స్​కి ఏవిధంగా దారితీస్తాయి? అందుకు గల కారణాలేంటి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముఖ్యంగా మనం డైలీ పళ్లు తోముకోవడానికి వాడే కొన్ని టూత్ పేస్ట్​లు, రిలాక్సేషన్ కోసం నమిలే చూయింగ్​లలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ ఉంటాయి. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఫలితంగా వాటిని తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా టూత్​పేస్ట్​లు, చూయింగ్​ గమ్​, మౌత్​వాష్​లు వంటి ఇతర ఉత్పత్తులల్లో జిలిటాల్ అనే ఆర్టిఫిషియల్ స్వీటెనర్​ను విస్తృతంగా వాడుతుంటారు. దీనిని సాధారణంగా సురక్షితమైన చక్కెర ప్రత్యామ్నాయంగా కూడా భావిస్తుంటారు. కానీ, జిలిటాల్​ను పరిమితికి మించి వాడితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

మీ టూత్​పేస్ట్​లో క్యాన్సర్​ ఉందా?

టూత్​పేస్ట్​లు, చూయింగ్​ గమ్​లలో ఉండే ఈ 'జిలిటాల్'​ ఆర్టిఫిషియల్ స్వీటెనర్​ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం శరీరంలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ వంటి గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిలిటాల్ అధిక వినియోగం హైపర్​కోగ్యులబిలిటీ స్థితికి కారణమవుతుందని చెబుతున్నారు. ఇది బాడీలో రక్తం గడ్డకట్టే ప్రక్రియను పెంచడానికి దారితీస్తుందట.

అంతేకాదు.. ఈ ప్రభావం ప్లేట్​లెట్స్, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే చిన్న రక్త కణాలపై పడుతుంది. దాంతో అది రక్తనాళాలలో గడ్డకట్టడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. అలా ఏర్పడిన గడ్డలు ధమనులలో రక్త ప్రవాహాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన హృదయనాళ ప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఆర్టిఫిషియల్ స్వీటెనర్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

చిన్న వయసులో గుండెపోటు ముప్పు - ఇవి అలవాటు చేసుకోవాల్సిందే!

2018లో "Thrombosis & Haemostasis" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. టూత్​పేస్ట్​, చూయింగ్​గమ్​లో ఉండే జిలిటోల్ అనే ఆర్టిఫిషియల్ స్వీటెనర్​ను ఎక్కువ మొత్తంలో తీసుకునే వ్యక్తులలో రక్తం గడ్డకట్టే ప్రమాదం 21% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ జిలిటోల్ తినే వ్యక్తులలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిశోధనలో నెదర్లాండ్స్​లోని ఉట్రెచ్ట్​ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ బర్నార్డ్ A. వాన్ డెర్ లాన్ పాల్గొన్నారు. జిలిటాల్​ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరిగి గుండె జబ్బులకు దారి తీసే ఛాన్స్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ 5 రకాల బాడీ పెయిన్స్​లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట!

ABOUT THE AUTHOR

...view details