Health Benefits Of Eating Garlic At Night :లేత పసుపు రంగులో ఉండి.. ఘాటైన రుచిని కలిగిన వెల్లుల్లివంటలకు మంచి రుచిని అందిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది రోజూ కూరల్లో వీటిని వేసుకుంటుంటారు. అయితే వెల్లుల్లి వంటలకు రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలును సైతం అందిస్తుంది. ముఖ్యంగా వీటిని రాత్రి పడుకునే ముందు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి. రోజూ రాత్రి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2014 లో "Complementary and Integrative Medicine" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..రాత్రి పూటవెల్లుల్లి తినేవారిలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు తక్కువగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బెల్జియంలోని ఘెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కరీన్ వెర్ష్యురెన్ (Dr. Karin Verschueren) పాల్గొన్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :వెల్లుల్లిలో జీర్ణక్రియ ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయని నిపుణులంటున్నారు.
అలర్ట్ - డైలీ ఒక సిగరెట్ తాగుతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి!
రక్తపోటు అదుపులో :వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనాలుంటాయి. ఇవి మన శరీరంలో రక్త నాళాలను విడదీసి.. రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే రక్తం గట్టకట్టే ప్రమాదం కూడా తగ్గుతుందట. కాబట్టి, అధిక రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటు అదుపులో ఉండటానికి వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.