Health Benefits Of Anjeer :అత్తిపండుగా పిలిచే అంజీరాలో మన శరీరానికి కావాల్సిన పీచు పదార్థం, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. 2-3 అంజీరాలను నైట్ మొత్తం వాటర్‌లో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తేనెతో తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం.
మలబద్ధకం తగ్గుతుంది :
నానబెట్టిన అంజీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతోబాధపడేవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీరా తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులంటున్నారు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంగా :
అత్తి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉదయాన్నే రెండు అంజీరాలను నానబెట్టుకుని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట.
చక్కెర స్థాయిలు అదుపులో :
సహజ సిద్ధంగానే కొద్దిగా స్వీట్‌గా ఉండే అంజీరాలను షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడేవారు ఉదయాన్నే నానబెట్టిన అంజీరాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు.
బరువు తగ్గొచ్చు :
అత్తి పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే నానబెట్టిన అత్తి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల కడుపునిండుగా ఉన్నట్లు అనిపించి.. ఎక్కువసేపు ఆకలి కాకుండా, అలాగే ఎక్కువగా తినకుండా ఉండవచ్చని అంటున్నారు.
అలర్ట్: బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే! - Benefits of Rice in Breakfast
మరిన్ని ప్రయోజనాలు :
- అంజీరాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.
- ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు మహిళలు ప్రతిరోజూ వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అంజీరాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
- అలాగే అత్తి పండ్లను తినడం వల్ల చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంటుందట.
- అంజీరా పండ్లలో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు.. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
- 2018లో "ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇన్ హెల్త్ అండ్ మెడిసిన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాత్రి పడుకునే ముందు 2 నానబెట్టిన అంజీరా పండ్లు తిన్నవారు ఎక్కువసేపు నాణ్యమైన నిద్రపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో యేదిటేప్ యూనివర్సిటీలో న్యూరోలాజీ ప్రొఫెసర్‌గా పనిచేసే డా. మెహ్మెట్ గుల్ పాల్గొన్నారు. రోజూ పడుకునే ముందు రాత్రి 2 నానబెట్ట అంజీరా పండ్లు తినడం వల్ల ఎక్కువసేపు నిద్రపడుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వేసవిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వేధిస్తున్నాయా ? ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్! - Skincare Tips in Summer
షుగర్ పేషెంట్స్ ఈ డ్రింక్స్ తాగితే - బ్లడ్ షుగర్ లెవల్స్ ఇట్టే తగ్గుతాయి! - Best Morning Drinks for Diabetics