Hair Loss Treatment in Ayurveda: మన తలపై ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెంకొంచెంగా రాలిపోతుంటే బాధగా ఉంటుంది. ఈ సమస్యను అరికట్టేందుకు సబ్బులు, షాంపూల నుంచి చిట్కా వైద్యం వరకు చాలానే ప్రయత్నిస్తుంటారు. అయితే, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 200 గ్రాములు కుంకుడుకాయ పొడి
- 25 గ్రాముల మెంతుల చూర్ణం
- 25 గ్రాముల ఉసిరి పొడి
- 25 గ్రాముల యష్టిమధు చూర్ణం
- 25 గ్రాముల మందారపువ్వుల చూర్ణం
తయారీ విధానం, వాడకం
- ముందుగా ఓ గిన్నెలో కుంకుడు కాయ పొడి, ఉసిరి పొడి, మెంతుల చూర్ణం, యష్టిమధు చూర్ణం, మందార పువ్వుల చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న పొడిని వేడి నీటిలో పోసి దగ్గరకు అయ్యేవరకు ఉంచాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సుమారు గంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
- అంతే జుట్టు రాలే సమస్యను తగ్గించే ఆయుర్వేద ఔషధం రెడీ! దీంతో తలస్నానం చేస్తే సరిపోతుందని అంటున్నారు.
- దీనిని ఓ గాజు సీసాలు పెట్టుకుని ఎలాంటి పురుగులు పట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెబుతున్నారు.
- తల స్నానం చేసేందుకు గంట ముందు దీనిని తయారు చేసుకోవాలని వివరించారు.
కుంకుడు కాయ: మన పురాతన కాలం నుంచి తల స్నానం అనగానే కుంకుడు కాయనే ఉపయోగిస్తుంటారు. ఇది నురగను ఇచ్చి వెంట్రుకలను శుభ్రం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెంతులు:ఇది జుట్టుకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుందని డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. ఇంకా తలలో ఉండే చుండ్రు సమస్యలను కూడా తగ్గించడంలోనూ మెంతులు బాగా సహాయపడతాయని వివరించారు.