తెలంగాణ

telangana

ETV Bharat / health

మీరు మేఘాల్లో తేలిపోతుంటే - జుట్టు నేల రాలుతోందా? - ఈ టిప్స్ పాటించండి! - Hair Care Tips While Riding Bike - HAIR CARE TIPS WHILE RIDING BIKE

Hair Care Tips While Riding Bike : బైక్ రైడింగ్ యువతకు భలే సరదాగా ఉంటుంది. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా బైక్ రైడ్​ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోరు! ఫలితంగా.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

Hair Care Tips While Riding Bike
Hair Care Tips While Riding Bike

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 11:14 AM IST

Hair Care Tips While Riding Bike : మహిళలు చర్మ సౌందర్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. జుట్టుకు సైతం అంతే ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు రాలుతోందంటే తెగ బాధపడిపోతుంటారు. సమస్య నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే.. జుట్టు రాలడానికి శరీరంలోని లోపాలతోపాటు ఇతర పనులు కూడా కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు! ఇలాంటి వాటిలో బైక్ రైడింగ్​ కూడా ఒకటని అంటున్నారు.

నగరాలు, పట్టణాల్లోని చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆఫీస్‌కు, ఇతర ప్రాంతాల వెళ్లడానికి టూ వీలర్ వినియోగిస్తుంటారు. అయితే.. మహిళలు టూవీలర్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టుదెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. గాలి కాలుష్యం, ఎండ కారణంగా.. జుట్టు రాలడం, చుండ్రు, హెయిర్‌ పొడిగా మారడం వంటి వివిధ రకాల ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి, మహిళలు బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హెయిర్‌ను గట్టిగా కట్టుకోండి :
చాలా మంది అమ్మాయిలు బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు హెయిర్‌ను లూజ్‌గా వదిలేస్తుంటారు. అయితే.. ఇలా అస్సలు చేయవద్దని నిపుణులంటున్నారు. ఎందుకంటే.. హెయిర్‌ లూజ్‌గా ఉండటం వల్ల రోడ్లపై ఉన్న దుమ్ము దూళి జుట్టును పాడుచేస్తాయని చెబుతున్నారు. అందుకే రైడింగ్‌ చేసేముందు జుట్టును గట్టిగా రబ్బర్‌ బ్యాండ్‌తో కట్టుకోవాలని సూచిస్తున్నారు.

జుట్టు సమస్యలన్నీ క్లియర్ - ఈ నేచురల్ ఆయిల్స్​ గురించి తెలుసా?

స్కార్ఫ్ ధరించండి :
చాలా మంది అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్‌ ధరిస్తారు. ఇది మంచి పద్ధతే అంటున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా, రంగు మారకుండా ఉంటుంది. అలానే ఫేస్‌ కూడా పాడవకుండా ఉంటుంది. అయితే.. హెల్మెట్‌ ధరించడం తప్పని సరి అని సూచిస్తున్నారు. జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే జాలీగా ఉంటుందని కొందరు భావిస్తారు. ఇది చూడ్డానికి బాగుంటుందేమోగానీ.. జుట్టు మాత్రం ఎక్కువగా దెబ్బ తింటుందని చెబుతున్నారు. అందువల్ల స్కార్ఫ్ ధరించి.. హెల్మెట్‌ పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇంకా..

  • బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు మంచి సన్‌ గ్లాసెస్‌ పెట్టుకోండి. దీనివల్ల సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవచ్చు.
  • అలాగే దుమ్మ ధూళి కళ్లలో పడకుండా ఉంటాయి.
  • ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి మంచి కండీషనర్‌ను హెయిర్‌కు అప్లై చేసుకోండి. దీనివల్ల జుట్టు ఎల్లప్పుడూ మృదువుగా, మెరిసేలా ఉంటుంది.
  • హెల్మెట్‌ ధరించి బైక్‌ నడిపిన తర్వాత దాన్ని ఒక్కసారిగా తీసేస్తే జుట్టు అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి.. మీ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎల్లప్పుడూ ఒక దువ్వెన, అద్దాన్ని పెట్టుకోండి.
  • మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్లిన తర్వాత ఒక నిమిషం దువ్వుకుంటే సరిపోతుంది.
  • పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తూ బైక్‌ రైడింగ్‌ చేయడం వల్ల హెయిర్‌ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులంటున్నారు.

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడానికి కారణాలివే - వెంటనే ఇలా చేయండి! - Premature Gray Hair Causes

మగాళ్లలో జుట్టు రాలే సమస్య - మీకు తల స్నానం చేయడం రాకనే!

ABOUT THE AUTHOR

...view details