తెలంగాణ

telangana

ETV Bharat / health

బాణపొట్టతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాటర్​ తీసుకుంటే ఇట్టే కరిగిపోద్ది!

Ginger Chia Water: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య బెల్లీ ఫ్యాట్. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి నలుగురిలో తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే అల్లం చియా వాటర్​ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Ginger Chia Water
Ginger Chia Water

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 2:04 PM IST

Ginger Chia Water Reducing Belly Fat: ఒక్కసారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే.. ఆ తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ భాగంలో పేరుకుపోయిన కొవ్వు ఈజీగా తగ్గదు. కానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల సహాయంతో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అందులో ఒకటి జింజర్​ చియా వాటర్​. ఈ డ్రింక్​ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్​ కరిగించుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

అల్లంలో పోషకాలు:అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు అల్లంలో విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

చియా పోషకాలు:చియాలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇందులోని ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. మలబద్ధకం నుంచి రిలాక్సేషన్​ లభిస్తుంది.

అల్లం చియా నీరు ఎందుకు?:జింజర్ చియా వాటర్​ బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును సహజంగా కరిగిస్తుంది. అయితే.. బెల్లీ ఫ్యాట్​ను తగ్గించడానికి కేవలం ఈ వాటర్​ తీసుకోవడం మాత్రమే కాకుండా.. రెగ్యులర్​గా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమే. ఈ డ్రింక్​ను మీ డైట్​లో భాగం చేసుకోవడం వల్ల జీవక్రియ రేటు గణనీయంగా పెరుగుతుంది. అలాగే థర్మోజెనిసిస్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది సమర్థవంతమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక దీని ప్రయోజనాల విషయానికొస్తే..

  • జీర్ణక్రియ:అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ ఉబ్బరం, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
  • మెటబాలిజం పెంచుతుంది: అల్లంలో జింజెరోల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం జీవక్రియ రేటును కొద్దిగా పెంచుతాయి. అలాగే రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్​ అయ్యేలా చేస్తుంది.
  • ఆకలి నియంత్రణ: చియా విత్తనాలు, అల్లం రెండూ ఆకలిని నియంత్రించేందుకు సాయపడతాయని కొన్ని అధ్యయనాలలో స్పష్టమయ్యాయి. చియా గింజలను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం వల్ల క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది పొట్ట ప్రాంతంలో కొవ్వు తగ్గడంతో బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
  • ఫైబర్ కంటెంట్​: చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సాయపడుతుంది. 2020లో జరిగిన ఒక అధ్యయనంలో 12 వారాల పాటు రోజుకు 2 గ్రాముల చియా గింజలు, 3 గ్రాముల అల్లం పొడిని తీసుకున్న వ్యక్తుల్లో బెల్లీ ఫ్యాట్‌ తగ్గిందని కనుగొన్నారు.
  • బ్లడ్ షుగర్ రెగ్యులేషన్: అల్లం, చియా గింజలు రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి.

ఇంట్లో అల్లం చియా నీటిని ఎలా తయారు చేయాలి:

  • ఒక జార్​లో 1 టీస్పూన్ తురిమిన అల్లం, 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు, 3 కప్పుల నీరుపోసుకోని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ జార్​ను 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత ఓ గ్లాసులో పోసుకుని తాగాలి. రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కొద్దిగా కలుపుకోవచ్చు.

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది!

హిప్​ ఫ్యాట్​ ఇబ్బంది పెడుతోందా? ఈ టిప్స్​తో వెన్నలా కరగడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details