Foods That Are Unhealthy :హెల్దీగా ఉండటానికి.. పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాగే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తారు. అందుకే చాలా మంది జనాలు డైట్‌లో హెల్దీ ఫుడ్‌ను, డ్రింక్స్‌ను యాడ్ చేసుకుంటూ ఉంటారు. రోజూ తినే ఆ ఆహార పదార్థాలు శరీరానికి మంచి చేస్తాయనే అనుకుంటారు. కానీ.. అందులో కొన్ని తీవ్ర అనారోగ్యకరమైనవి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
డైజెస్టివ్ బిస్కెట్స్ :
మనలో చాలా మంది ఆకలిగా ఉన్నప్పుడు తినే డైజెస్టివ్ బిస్కెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అనుకుంటారు. కానీ, నిజానికి వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండవట. వీటిని ప్రాసెస్‌డ్ పిండి పదార్థాలు, షుగర్‌తో తయారు చేయడం వల్ల.. ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తు్ననారు. డైజెస్టివ్ బిస్కెట్లలో అధిక క్యాలరీలు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2017లో ప్రచురించిన 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అధ్యయనం ప్రకారం.. డైజెస్టివ్ బిస్కెట్లు ఎక్కువగా తినే వారిలో బరువు పెరిగే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.
పిల్లలకు హెల్త్ డ్రింక్స్ :
ప్రస్తుత కాలంలో.. హెల్త్ డ్రింక్స్ చాలా పాపులర్. వీటిని రంగురంగులప్యాకెట్లలో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లు, షాపుల్లో అమ్ముతున్నారు. పిల్లల ఆరోగ్యానికి మంచివని వీటిని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే.. వీటిని తయారు చేయడానికి చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే పాడవకుండా ఉండటానికి వివిధ రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని నిపుణులంటున్నారు.
మీ పిల్లలు జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటున్నారా ? ఇలా చేస్తే పూర్తిగా మానేస్తారు!
డైట్ ఖఖ్రా (Diet Khakhra) :
చాలా మంది సాయంత్రం టీ తాగేటప్పుడు స్నాక్స్‌గా డైట్ ఖఖ్రాను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, నిజానికి వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని రోజూ తినడం వల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.