Foods That Increase Stress : ఈ రోజుల్లో చాలా మధ్య ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల పొద్దున లేచిన దగ్గర నుంచి.. రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల చాలా మందిలో ఒత్తిడి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు మనం తీసుకునే ఆహారంకూడా స్ట్రెస్‌కు గురయ్యేలా చేస్తుందని అంటున్నారు! అవునండీ.. రోజు మనం తీసుకునే ఫుడ్ సైతం మనల్ని ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుందట. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చక్కెర :
రోజువారి ఆహారంలో షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక్కసారిగా శరీరంలో చక్కెర స్థాయులు పెరగడం, తగ్గడం కూడా స్ట్రెస్‌ను కలుగజేస్తుందని అంటున్నారు. తీపి పదార్థాలను దీర్ఘకాలికంగా ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
కెఫీన్:
కెఫీన్ ఉండే కాఫీ, టీ, కోలా వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయని అంటున్నారు. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అడ్రినల్ గ్రంథులకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే కెఫీన్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగి.. చివరికి ఆందోళనను కలిగిస్తుందని తెలియజేస్తున్నారు.
ఫ్రైడ్ ఫుడ్:
నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం వల్ల కూడా ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమవుతుందని అంటున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి.. క్రమంగా శరీరంలో ఒత్తిడి, ఆందోళనలకు కారణమవుతుందని తెలియజేస్తున్నారు.