Fenugreek Seeds Benefits In Telugu : ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బు సమస్య సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారిలో మాత్రమే కన్పించే ఈ గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. అయితే గుండె జబ్బులకు ప్రధాన కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన శరీరంలోని రక్తంలో అధికంగా పేరుకుపోయి ఒక్కోసారి హార్ట్ ఎటాక్‌లకు కూడా దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఓ పోపు దినుసు ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ పదార్థమే మెంతులు. నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం ద్వారా చాలా వరకు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. మరి మెంతులు తినటం వల్ల కొవ్వు కరగడమే గాక కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు.
ఫైబర్‌ను రిలీజ్ చేస్తుంది
నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తినటం ద్వారా మీ జీర్ణవ్యవస్థలో ఫైబర్ కంటెంట్ విడుదల అవుతుంది. తద్వారా మీ బాడీలోని అదనపు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల చెడు కొవ్వు మీ రక్తంలోకి చేరకుండా ఉంటుంది.
ట్రెగ్లిజరైడ్లను తగ్గిస్తుంది
శరీరంలో ట్రైగ్లిజరైడ్లు అనే హానికరమెన కొవ్వు ఉంటుంది. చెడు కొవ్వుతో పాటు ఇది కూడా ప్రమాదకరమే. ఈ రకమైన కొవ్వు రక్తంలో అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు సులువుగా ఎటాక్ చేస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన మెంతులను తినటం ద్వారా ఈ డేంజరస్ ట్రెగ్లిజరైడ్లను రక్తంలోనే కరిగించుకోవచ్చు. దీంతో మీ గుండె పదిలంగా ఉంటుంది.
LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
చెడు కొలెస్ట్రాల్‌గా చెప్పే LDL కొలెస్ట్రాల్‌ను మెంతులతో సులువుగా కరిగించుకోవచ్చు. మెంతుల్లో ఉండే సపోనిన్స్ అనే పదార్థం శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.