తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Face Wash Tips - FACE WASH TIPS

Face Wash Tips : కాలమేదైనా సరే.. చాలామంది పదే పదే ముఖం కడుక్కుంటారు. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు పోయి శుభ్రంగా ఉంటుందని.. ముఖం తాజాగా ఉంటుందని భావిస్తారు. మీక్కూడా ఇలా ఫేస్ వాష్ చేసుకునే హ్యాబిట్ ఉందా? మరి.. అలా మాటిమాటికీ ముఖం కడుక్కోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Face Wash Side Effects in Telugu
Face Wash Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:45 AM IST

Face Wash Side Effects in Telugu :రోజువారీ పని, గాలిలోని దుమ్మూ ధూళి, చెమట కారణంగా ముఖం మీద మలినాలు పేరుకుపోతుంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే.. మరికొంతమంది మాత్రం కాలంతో సంబంధం లేకుండా రోజులో ఎక్కువ సార్లు ముఖం కడుక్కుంటుంటారు. ఇలా పదే పదే ఫేస్ వాష్(Face Wash) చేసుకోవడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువ అని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ.. ఎక్కువసార్లు ఫేస్​వాష్ చేసుకుంటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మ సమస్యలు తలెత్తే ఛాన్స్ :చాలా మంది మాటిమాటికీ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మంపై మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుందని భావిస్తారు. కానీ, అది పెద్దపొరపాటు అంటున్నారు నిపుణులు. చర్మం పొడిబారకుండా సెబమ్‌ అనే నూనె పదార్థం కాపాడుతూ ఉంటుంది. మీరు ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల అది తొలగిపోతుందంటున్నారు. ఫలితంగా.. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా అని సూచిస్తున్నారు. అంతేకాదు.. చర్మం మరింత పొడిబారిపోయి పొలుసులుగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. రోజుకు రెండు నుంచి మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేసుకోకపోవడమే మేలు అంటున్నారు.

2016లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రోజుకు ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకున్న వారిలో చర్మం పొడిగా మారడం, చికాకుగా అనిపించడం వంటి సమస్యలను గమనించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ పెర్రిన్ పాల్గొన్నారు. డైలీ రెండు, మూడు కంటే ఎక్కువ సార్లు ముఖం కడుక్కునే వారిలో చర్మం పొడిబారడం వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ : రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలనేది చర్మతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ చర్మతత్వం గల వారు.. రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఫేస్‌ వాష్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు. అదే.. జిడ్డు చర్మతత్వం ఉన్నవారైతే రోజుకి రెండు నుంచి మూడుసార్లు ఫేస్‌ వాష్ చేసుకుని.. ఆపై టోనర్‌ని యూజ్ చేస్తే ఎక్కువ సమయం తాజాగా కనిపించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇక పొడి చర్మం గల వారు.. ఒకటి రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు.

జిడ్డు చర్మంతో ఇబ్బందా? ఈ నేచురల్ క్లెన్సర్లతో షైనింగ్ స్కిన్ మీ సొంతం!

సరైన ఫేస్ వాష్ ఎంచుకోవడం :మీ చర్మతత్వానికి తగిన ఫేస్‌వాష్‌లను సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరికి గాఢత తక్కువగా ఉన్నవి యూజ్ చేసినా సమస్యలొస్తుంటాయి. కాబట్టి, మీరు ఫేస్ వాష్​లను తీసుకునే ముందు దానిపై ఉండే లేబుల్​ని ఓసారి చదివి.. మీ చర్మతత్వానికి ఏది సెట్ అవుతుందో దానిని తీసుకోవడం బెటర్ అంటున్నారు. అదేవిధంగా యూజ్ చేసే ముందు.. ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేయడమూ మర్చిపోవద్దని చెబుతున్నారు.

తేమశాతం తగ్గకుండా చూసుకోవాలి :రోజులో ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే.. ఈ అలవాటు మానుకోవడంతో పాటు ఓ చిట్కాను పాటించడం మంచిదంటున్నారు.

ఇందుకోసం.. ఒక చిన్న బౌల్​లో కొద్దిగా బాదం నూనె తీసుకొని స్నానం చేయడానికి ముందు.. ఫేస్, బాడీకి బాగా అప్లై చేయాలి. గంటపాటు ఉంచి ఆపై స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా చర్మపోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకి.. స్కిన్ మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్​ స్కిన్​ పక్కా!

ABOUT THE AUTHOR

...view details