Face Mask is Good For Skin? : మెరిసే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అందులో ఫేస్ మాస్క్ ఒకటి. ఇవి వాడడం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుందని భావిస్తుంటారు. మరి.. ఇంతకీ ఫేస్‌మాస్క్ వేసుకోవడం మంచిదేనా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
Face Mask: చర్మ సంరక్షణ కోసం ఫేస్ మాస్క్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి చర్మానికి పోషణ, హైడ్రేటింగ్ అందించడమే కాకుండా.. చర్మ సంబంధిత సమస్యలనూ నయం చేస్తాయట. మఖంపైన మొటిమలు, రంధ్రాలు, మచ్చలను తొలగించడంతోపాటు మెరుగైన మేనిఛాయ, మెరుపు తీసుకురావడంలో ఫేస్ మాస్క్‌లు చక్కగా పనిచేస్తాయని అంటున్నారు.
ఫేస్ మాస్క్ ప్రయోజనాలు:
డీప్ క్లెన్సింగ్:రోజూ ఫాలో అయ్యే క్లెన్సింగ్ చర్మ రంధ్రాల లోపల ఇరుక్కుపోయి ఉన్న మలినాలను బయటకు లాగలేదు. ఇందుకోసం ఫేస్ మాస్క్ చక్కగా పనిచేస్తుందట. రెగ్యులర్‌గా ఉపయోగించే క్లెన్సర్ కంటే కూడా మాస్క్ డీప్‌గా క్లెన్స్ చేస్తాయని చెబుతున్నారు. చర్మాన్ని డీటాక్సిఫై చేసి, డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తాయట.
స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుదల: వారానికి ఒకసారి ఫేస్ మాస్క్ వాడడం వల్ల.. స్కిన్ పై ఎలాంటి మచ్చలూ లేకుండా కనపడుతుందట. చర్మం లోపలి నుంచి మురికి, బ్యాక్టీరియా తీసేయడం ద్వారా లోపలి నుంచి చర్మానికి కాంతినిస్తుందని చెబుతున్నారు.
ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ఫేస్ మిలమిలా మెరవడం గ్యారంటీ!