Exercises For Back And Spinal Cord : ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల ముందుగా మన వెన్నుముక బలపడుతుంది. యాక్టివ్‌గా ఉంటూ రోజూ వ్యాయామం చేస్తుండటం వల్ల పూర్తి శరీరం స్ట్రాంగ్‌గా ఉండి సమస్యలు రాకుండా ఉంటుంది. కండరాలు మంచి షేప్‌లో ఉండటానికి కూడా ఎక్సర్ సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది ఎక్కువ శాతం ఎక్సర్‌సైజ్ చేయడానికి బద్ధకిస్తారు. చేయకపోతే పోయేదేముంది అనుకుంటూ ముఖ్యమైన వెన్ను భాగాన్ని దెబ్బతినేలా చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చాక, వెన్నుముక ఆరోగ్యం సడెన్‌గా గుర్తుకొచ్చి జిమ్‌లు, ఫిట్‌నెస్ క్లబ్‌లు అంటూ బోలెడు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అసలు డబ్బు ఖర్చే లేకుండా, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి మీ వెన్ను భాగాన్ని బలపరుచుకుని, భవిష్యత్‌లోనూ వెన్నునొప్పి అనేది లేకుండా చేసుకోవాలంటే, ఇంట్లోనే ఉండి ఈ ఐదు ఎక్సర్సైజ్లు చేసుకోండి.
డెడ్‌లిఫ్ట్స్
డెడ్‌లిఫ్ట్స్ అనేవి శరీరంలోని అన్ని భాగాల కదలికలను మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు ఎదుర్కొనే వెన్నునొప్పి సమస్య రాకుండా వెనుక భాగాన్ని బలంగా ఉంచుకోవాలంటే డెడ్‌లిఫ్ట్స్ చేయడం తప్పనిసరి.
పుష్-అప్ హోల్డ్
ఇదొక డిఫరెంట్ టైప్ పుష్-అప్స్. కానీ, శరీరంలోని అన్ని భాగాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వెనుక భాగం, భుజాలు, మోచేతులు, పొట్ట భాగంలో కండరాలను ఈ వ్యాయామం బలపరుస్తుంది. మీ శరీరం మంచి షేప్‌లో ఉండాలంటే పుష్-అప్స్ చాలా మెరుగైన పని.
ప్లాంక్స్
ఇంట్లోనే ఉండి చేసుకునే ఎక్సర్‌సైజ్‌లలో ప్లాంక్స్ చాలా మంచి వర్కౌట్‌గా చెబుతుంటారు ఫిట్‌నెస్ ప్రియులు. ఎటువంటి పరికరం లేకుండా శరీరపు వెనుక భాగాన్ని దృఢంగా చేసి, శరీర భంగిమను చక్కదిద్దే శక్తి ఈ ఎక్సర్సైజ్కు ఉంది.
ఫార్వార్డ్ పుల్ విత్ వెయిట్
ఈ ఎక్సర్‌సైజ్ పూర్తిగా మీ వెన్ను భాగం కోసమే. ముందుగా మీ వెన్ను పై భాగాన్ని బలపరిచి, ఆ తర్వాత వెనుక భాగంలో కింది వరకూ దృఢంగా చేస్తుంది. శరీర భంగిమను చక్కదిద్ది, మంచి షేప్‌లో ఉంచేందుకు సహకరిస్తుంది.