Eggs For Hair Benefits :జుట్టు సంరక్షణకు గుడ్డు తిరుగులేని పదార్థం. వెంట్రుకలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు బలపరిచేందుకు సహాయపడే ప్రొటీన్లు, న్యూట్రియన్లు, పోషకాలు గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్ జుట్టును మృదువుగా, మెరిసేలా తయారుచేస్తుంది. గుడ్డులోని తెల్లసొన జిడ్డుగా ఉన్న వెంట్రుకలకు, పచ్చసొన పొడిగా, నిర్జీవంగా ఉన్న వెంట్రుకలకు బాగా సహాయపడతాయి. చుండ్రును తగ్గించేందుకు, చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేసేందుకు గుడ్డు మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇలా పూర్తి ఆరోగ్యానికి ఉపయోగపడే గుడ్డును వెంట్రుకలకు ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు తెలుసా? ఇదిగో ఇక్కడ తెలుసుకోండి మరి!
1. ఎగ్ మాస్క్
ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకుని మొత్తం జుట్టుకు అప్లై చేయాలి. ఇలా 20 నుంచి 30 నిమిషాల పాటు వెంట్రుకలను గుడ్డు మిశ్రమాన్ని ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మాస్క్ మీ వెంట్రుకలను చక్కగా మాయిశ్చరైజ్ చేసి బలంగా తయారు చేస్తుంది.
2. గుడ్డు+ ఆలివ్ నూనె
పొడిబారిన జుట్టుతో ఇబ్బంది పడే వాళ్లు రెండు గుడ్లలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి బాగా పట్టించండి. ఈ మిశ్రమాన్ని 30నిమిషాల పాటు తలకు పట్టించి ఉంచిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్డు, ఆలివ్ నూనెల కలయిక వెంట్రుకలను మంచి శోషణ్ అందించి మృదువుగా మార్చుతుంది.
3. ఎగ్+ యోగర్ట్
ప్లేన్ యోగర్ట్ తీసుకుని అందులో మీకు మొత్తం వెంట్రుకలకు సరిపడేలా రెండు గుడ్లను కలిపాలి. ఈ మిశ్రమాన్ని తలకు చక్కగా పట్టించి 20 నుంచి 30నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది మీ తలను మొత్తం శుభ్రం చేసి వెంట్రుకల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.