Drumstick Tree Leaves Health Benefits :ప్రకృతిలోని ప్రతి చెట్టు ఓ ప్రత్యేక లాభాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం, వృక్షశాస్త్రం ప్రకారం ప్రతి మొక్కలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందులో ఓ అద్భుతమైన మొక్క మునగ. మునగ చెట్టులో ఒకటి కాదు, కొన్ని వందల రకాల ఔషధ గుణాలుంటాయట. మునగ ఆకులు, కాయలు, బెరడు, పూలు, రసం, వేర్లు ఇలా ప్రతీది ఔషధాల తయారీలో ఉపయోగపడి, అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందట. ఎన్నో రకాల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను నయం చేయగల శక్తి మునగ చెట్టుకు ఉందట. ఇవే కాకుండా మునగకాయలతో కూర, సాంబార్, మునగాకుతో కారంపొడి, మునగ రసంతో రొట్టెలు, ఇలా చాలా రకాలుగా మనం వాడే మునగ చెట్టు చేసే ఆ అద్భుతాలేంటో తెలుసుకుందాం.
చర్మ సంరక్షణకు!
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మునగ ఆకులు నిస్తేజమైన చర్మానికి తిరిగి తేజస్సు ఇవ్వగలవు. చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా తయారుచేయడంతో పాటు ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయట. మునగ ఆకు పేస్టు రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
కురుల ఎదుగుదలకు!
మునగ ఆకు రసం జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా సహాయపడుతుందట. దీన్ని తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు ఒత్తుగా మారుతుందట. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారేందుకు మునగాకు రసం బాగా పనిచేస్తుందట.
యాంటీ ఇన్ఫ్లమేటరీలతో!
మునగ ఆకులో ఐసోథియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో పలు చోట్ల వచ్చే వాపు, నొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే దీంట్లోని విటమిన్-సి, జీటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్‌ఫెరోల్ వంటి ముఖ్యమైన పోషకాలు నిండిన రోగనిరోధక శక్తిని బలపరిచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.