Drinks for Better Sleep :ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదు. అయితే, మనిషికి కంటి నిండా నిద్ర లేకపోవడంతో మరుసటి రోజు నీరసంగా ఉంటుంది. దీంతో ఏ పని చేయాలని అనిపించదు. ఇలా దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడటం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, నిద్రలేమి సమస్యతో బాధపడేవారునిద్రపోవడానికి ముందు కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ప్రశాంతమైన నిద్రను అందించే ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాలల్లో పసుపు :డైలీ ఒక గ్లాసు పసుపు కలిపిన పాలను నైట్ టైమ్‌లో తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం నిద్రలేమికి కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పాలను తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయట. చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. అలాగే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులంటున్నారు.
గోరు వెచ్చని పాలు :కొంత మంది నైట్ టైమ్‌లో కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యల వల్ల నిద్రపోకుండా ఉంటారు. ఇలాంటి వారు రోజూ గోరువెచ్చని పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి హాయిగా నిద్రపోవచ్చు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్ర పోయేలా ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫుడ్ ఎంత తింటే - మీ ఆయుష్షు అంత తగ్గిపోతున్నట్టే! - Ultra Processed Food Effects
బాదం పాలు :రోజూ ఆహారంలో బాదంపప్పులను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది అందరకీ తెలిసిందే! అయితే, రోజూ రాత్రి బాదం పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు కంటినిండా నిద్రపోయేలా చేస్తాయని తెలియజేస్తున్నారు.