తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇంట్రస్టింగ్ : చాయ్ తాగితే బరువు పెరుగుతారా? - నిపుణులు ఏం చెబుతున్నారు! - DOES DRINKS TEA INCREASE WEIGHT

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది టైమ్ లేదనే కారణంతో మార్నింగ్ టిఫెన్ తినకుండా టీ తాగి డ్యూటీలకు వెళ్తుంటారు. అయితే, ఇలా చేయడం బరువు పెరగడానికి కారణమవుతుందా? నిపుణుల సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.

DOES TEA INCREASE WEIGHT
DOES DRINKS TEA INCREASE WEIGHT (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Oct 9, 2024, 1:41 PM IST

Updated : Oct 9, 2024, 2:23 PM IST

Can Tea Cause Weight Gain? : నేటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. షిఫ్ట్​ల వైజ్ డ్యూటీలు, మారిన భోజన, నిద్ర వేళలు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి.. ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎంతో మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మందిలో బరువు పెరిగే విషయంలో రకరకాల సందేహాలు వస్తుంటాయి.

అందులో ప్రధానంగా ఎక్కువ మందిలో వచ్చే సందేహం.. ఉదయం పూట ఇంటి పనులు, ఇతర పనుల హడావుడిలో టిఫెన్ తినడానికి టైమ్ లేక.. టీ తాగి ఆఫీసుకి వెళ్లిపోతుంటాం. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ తీసుకుంటుంటాం. అయితే.. ఇలా మార్నింగ్ టిఫెన్ స్కిప్ చేసి టీ తాగడం బరువు పెరగడానికి దారితీస్తుందా? దీనిపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా రోజూ తీసుకునే ఆహారాన్ని టిఫెన్, లంచ్, డిన్నర్‌.. అంటూ మూడు భాగాలుగా విభజించుకొని తీసుకుంటుంటాం. అయితే, ఆయా వేళల్లో ఏయే పదార్థాలు తింటున్నాం.. వాటి నుంచి మీకు ఎంత మోతాదులో కెలరీలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, పీచు.. వంటి పోషకాలు అందుతున్నాయనేది చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. ఇవన్నీ సమపాళ్లలో శరీరానికి అందినప్పుడు ఒక పూట తినడం మానేసినా ఆరోగ్యంగా ఉండగలరని సూచిస్తున్నారు. అంటే.. దీన్ని బట్టి చూస్తే మీరు మార్నింగ్ ఒకవేళ టిఫెన్ స్కిప్ చేసినా.. మిగతా రెండు పూటలా సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా.. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు శరీరానికి సరిపడా కేలరీలు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. మనం భోజనం చేసే సమయ వేళలు మాత్రమే బరువు తగ్గడానికీ, పెరగడానికీ కారణం కాదని సూచిస్తున్నారు. అలాగే.. సాధారణంగా ప్రతి వ్యక్తికీ వారి జీవగడియారం ఆధారంగా కొందరికి ఉదయం పూట చక్కెర నిల్వలు అధికంగా ఉంటే.. మరికొందరిలో సాయంత్రం పూట ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి.. వాటిని బట్టి వారివారి భోజనవేళలలో మార్పులు చేసుకోవచ్చంటున్నారు.

అయితే.. మీరు ఒక పూట అల్పాహారమో, భోజనమో మానేసినా శరీరానికి అందాల్సిన కెలరీలు, ఖనిజాలు, ప్రొటీన్, పీచు, విటమిన్లు.. అన్నీ అందుతున్నాయో లేదో చూసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా.. కెలరీల మోతాదు తగ్గించి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఇవన్నీ మీపై ప్రతికూల ప్రభావం చూపించకుండా, బరువు పెరగకుండా ఉండడానికి తోడ్పడతాయని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

వెయిట్ చెక్ చేసుకుంటే బరువు తగ్గుతారట! వారంలో ఎన్ని సార్లు చూసుకోవాలి?

బీర్​ తాగితే వెయిట్​ గెయిన్ అవుతారా? నిపుణుల మాటేంటి? మరి జాగ్రత్తలు పాటిస్తే!

Last Updated : Oct 9, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details