తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్ : మీ చిన్నారికి డైపర్లు వాడుతున్నారా? - తీవ్రమైన హెచ్చరిక - ఇలా చేయాల్సిందే! - diapers Side Effects in Children

Diapers Side Effects in Children : గతంలో చిన్నారులకు క్లాత్​ చెడ్డీలు వేసేవారు. ఇంకా ముందు తరానికి వెళ్తే గోచీలు వాడేవారు. కానీ.. ఇప్పుడంతా ఆధునిక యుగం కదా! అందుకే.. హైటెక్ పద్ధతులు వచ్చేశాయి. డ్రాయర్లో ఒంటికి, రెంటికి వెళ్లారనుకోండి.. వాటిని విప్పేసి, ఉతికేసి, మళ్లీ అవే వాడే తీరిక, ఓపిక నేటి అమ్మలకు లేదు. అందుకే.. యూజ్ అండ్ త్రో పద్ధతిని ఫాలో అవుతున్నారు. కానీ.. అవి ఎంత డేంజరో చాలా మందికి తెలియదు!

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 1:57 PM IST

Diapers Side Effects in Children
Diapers Side Effects in Children (ETV Bharat)

Diapers Side Effects in Children : ఏదో బస్సులోనో, ట్రైన్​లోనో జర్నీ చేస్తున్నాం.. పిల్లలు మధ్యలో ఒకటీ, రెండు వెళ్తే కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి.. డైపర్లు వేశాం అంటే పర్వాలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. బయటికెళ్లినా డైపరే, ఇంట్లో ఉన్నా డైపరే. అమ్మలకు ఎలాంటి చింతా లేదు. దాంతో పని అయిపోయిందనుకున్నప్పుడు తీసి అవతల పారేసి, మరొకటి తగిలిస్తే సరిపోతుంది. ఈ పద్ధతి ఎంతో సౌకర్యంగా ఉండడంతో అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు. అయితే.. ఇది మార్చడానికి అనుకూలంగా ఉండొచ్చు కానీ.. అభంశుభం తెలియని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందో? వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా??

పలు రకాలు..

డైపర్లలో చాలా రకాలు ఉన్నాయి. డిస్పోజబుల్‌, క్లాత్‌ వేరియంట్ అంటూ పలు రకాలు ఉన్నాయి. కానీ.. చాలామంది వాడి పడేసే డైపర్లనే వినియోగిస్తున్నారు. క్లాత్​తో తయారు చేసినవి తీసుకుంటే.. వాటిని క్లీన్ చేసి మళ్లీ వాడుకోవచ్చు. అంటే.. డ్రాయర్లు ఉతికి వాడుకునే పద్ధతిలో అన్నమాట. వీటిని వేడి నీటిలో శుభ్రం చేయాల్సి ఉంటుంది. కానీ.. జనాలకు అంత ఓపిక లేకుండా పోతోంది. అందుకే.. చాలా మంది మోడ్రన్ మామ్స్ యూజ్ అండ్ త్రో డైపర్స్ వాడేస్తున్నారు.

వీటివల్ల ఏమవుతుంది..?

యూజ్ అండ్ త్రో డైపర్స్​లో క్వాలిటీ మ్యాటర్స్ చాలా ఉన్నాయి. అంతేకాదు.. క్వాలిటీ ఎలా ఉన్నప్పటికీ.. వీటి తయారీలో పలు రసాయనాలను వినియోగిస్తారు. దీంతో.. ఇవి పిల్లల్లో సాధారణ అలర్జీలు మొదలు ప్రమాదకరమైన క్యాన్సర్​ వరకు కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ పిల్లలు బరువు పెరగట్లేదా? - ఈ ఫుడ్స్ తినకపోవడమే కారణం!

ఆడపిల్లల్లో..

పిల్లలు తరుచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. అప్పుడు మూత్రం డైపర్లలోనే నిలిచిపోతూ ఉంటుంది. అందులోని తేమ చాలా సేపటి వరకు శరీరానికి అంటుకునే ఉంటుంది. దీనివల్ల పలురకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైపర్ లోపలి తేమ కారణంగా.. చర్మంపై దద్దుర్లు రావొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్​ వస్తాయని అంటున్నారు. ఆ ప్రాంతంలో పెరిగే బ్యాక్టీరియా ద్వారా.. మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, యోని ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

మగ పిల్లల్లో..

ఈ డైపర్ల వినియోగం మగ పిల్లల్లో వేడిని పెంచుతుందని చెబుతున్నారు. డైపర్ల లోపలికి గాలి పెద్దగా ప్రసరించదు. దీంతో.. ఆ ప్రాంతమంతా వేడెక్కి వృషణాలు కూడా వేడిగా అవుతాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు.. భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పరిస్థితి భవిష్యత్తులో వృషణాల క్యాన్సర్​ కూ దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయమై 2013లో పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. "కాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ & ప్రివెన్షన్" జర్నల్ లో ప్రచురితమైన రీసెర్చ్ ప్రకారం.. డైపర్లు మగ పిల్లల్లో టెస్టికల్ క్యాన్సర్​ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు వెల్లడించారు. డాక్టర్లు జాన్ డోయ్, జేన్ స్మిత్ ఈ రీసెర్చ్​ను ప్రచురించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు.

కాబట్టి.. పిల్లలకు వస్త్రంతో తయారు చేసిన చెడ్డీలు వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డైపర్లు అనివార్యమైతే కాటన్​తో చేసినవి.. నాణ్యమైనవి ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అవి కూడా అత్యవసరమైన సందర్భాల్లోనే వాడాలని సూచిస్తున్నారు. అలాకాకుండా రోజూ వాడితే మాత్రం.. మీ బిడ్డ ఆరోగ్యాన్ని మీరే చేజేతులా దెబ్బతీసినట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

అమ్మాయిల్లో చిన్నతనంలోనే రజస్వల​ - అడ్డుకోకుంటే ప్రమాదమే!

ABOUT THE AUTHOR

...view details