ETV Bharat / entertainment

సుధీర్ 'మా నాన్న సూపర్‌ హీరో', వరుణ్ 'మట్కా' క్రేజీ గ్లింప్సెస్​- మీరు చూశారా? - Maa Nanna Super Hero

Maa Nanna Super Hero : టాలీవుడ్ స్టార్ సుధీర్‌బాబు హీరోగా నటించిన సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. శనివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Maa Nanna Super Hero
Maa Nanna Super Hero (Source: ETV Bharat)

Maa Nanna Super Hero Trailer : టాలీవుడ్ స్టార్ సుధీర్‌బాబు హీరోగా నటించిన సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్ణ కథానాయిక. సాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు.

తండ్రిని ఎంతగానో ప్రేమించే కుమారుడి కథ ఇది. తండ్రీ- కొడుకు మధ్య ఎమోషనల్ సీన్స్ ట్రైలర్​లో చూపించారు. 'నాన్న కన్నా డబ్బులు ఎక్కువ కాదు', కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం మారదు, ప్రేమతో చేసినంత మాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు', 'కనగానే తండ్రి అయిపోరు' అనే డైలాగ్స్​ ట్రైలర్​లో హైలెట్స్. సాయాజీ షిండే, సాయి చంద్ పాత్రలకు మంచి స్కోప్ ఉన్నట్ల కనిపిస్తుంది. ఇక వీళ్లతోపాటు శశాంక్, ఆమని ఆయా పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సునీల్ బలుసు నిర్మించారు.

Varun Tej Matka Teaser : మెగా హీరో వరుణ్‌తేజ్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'మట్కా'. కరుణ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్​గా నటిస్తోంది. నవంబర్‌ 14న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం టీజర్‌ విడుదల చేసింది.

టీజర్ రిలీజ్ ఈవెంట్ శనివారం విజయవాడలో జరిగింది. 2 నిమిషాల నిడివి ఉన్న టీజర్​ ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. 'విశాఖపట్టణం అంటే ఒకటి సముద్రం గుర్తురావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి' అనే డైలాగ్​​ బాగుంది. హీరో వరుణ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నారు.

1958 నుంచి 1982 వరకూ సాగే ఈ పీరియాడిక్‌ కథగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతోన్న చిత్రమిది. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర, అజయ్‌ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మెట్ల మార్గంలో తిరుమలకు మహేశ్​ బాబు ఫ్యామిలీ - స్వామివారిని దర్శించుకున్న వరుణ్​ తేజ్​ దంపతులు - Mahesh Babu Family Visit Tirumala

'హరోం హర' రిలీజ్ పోస్ట్​పోన్​ - సుధీర్​కు కలిసొచ్చే నెలలో రిలీజ్ - Harom Hara Movie Release Date

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.