What are the Reasons for Breast Cancer in Telugu: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎంతో మంది దీని బారిన పడి మరణిస్తున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్ రావడానికి చాలా కారణాలున్నాయని.. అవేంటో తెలుసుకుంటే మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయిన బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి? అసలు దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరికి వస్తుందంటే:
అధిక బరువు: 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన Handbook of Cancer Prevention ప్రకారం.. బరువు ఎక్కువగా ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. International Agency for Research on Cancer సంస్థ Breast Cancer అనే అంశంపై చేపట్టిన ఈ అధ్యయనంలో డాక్టర్ Béatrice Lauby-Secretan (IARC) పాల్గొన్నారు. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది. (National Cancer Institute రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
మద్యం సేవించడం: అధికంగా మద్యం తాగే మహిళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్ తాగని వారితో పోల్చితే మద్యం తాగిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాల్లోనూ తేలిందంటున్నారు. ధూమపానం చేయడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం: తగినంత శారీరక శ్రమ లేకపోవడం, నిశ్చల జీవనశైలి వల్ల కూడా మహిళ్లలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకే చోట ఎక్కువగా స్తబ్దుగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
హార్మోన్ థెరపీలు: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించుకునేందుకు హార్మోన్ థెరపీలను పాటిస్తుంటారు. అయితే, వీటిని అనుసరించడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు.
తల్లి పాలు ఇవ్వకపోవడం: తల్లిపాలు ఇవ్వకపోవడం కూడా రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు లేని మహిళలు, తల్లి పాలు ఎక్కువగా ఇవ్వని వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని తెలుపుతున్నారు. పిల్లలకు పాలు ఇచ్చిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని వివరిస్తున్నారు.
గర్భ నిరోధక మాత్రల వినియోగం: కొంత మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడుతుంటారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ మందులు హార్మోన్లను ప్రభావితం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు :
- రొమ్ముల్లో గడ్డలు ఏర్పడడం
- రొమ్ములో వాపు లేదా ఉబ్బినట్లుగా ఉండడం
- చనుమొనల నుంచి ఏవైనా ద్రవాలు రావడం
- రొమ్ము చర్మం, చనుమొన ఎరుపెక్కడం
- చనుమొన కాస్త లోపలికి వెళ్లినట్లు కనిపించడం
- చేయి, భుజం, చంకల్లో వాపు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అవాంఛిత రోమాలకు కారణాలు ఇవేనట - ఇలా చేస్తే ఈజీగా తొలగించుకోవచ్చట! - Unwanted Hair on Face Reason