Diabetes and Blood Pressure Causes : ప్రస్తుత రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ జబ్బుల బారిన పడుతున్నారు. నగర, పట్టణ వాసులే కాదు, పల్లె జనం కూడా వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యంపై అవగాహన రాహిత్యంతోనే, ఈ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారంటున్నారు నిపుణులు. కాబట్టి, తొలి నుంచే ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలకు దూరంగా ఉంచొచ్చని చెబుతున్నారు. ఇంతకీ, ఇవి తలెత్తడానికి ప్రధాన కారణాలేంటి? వీటి బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులే ఈ పరిస్థితికి ప్రధాన కారణమంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాసులు. నార్మల్‌గా మన శరీరం సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా స్పందిస్తుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఫుడ్ తీసుకుంటే జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ నెమ్మదించడంతో ఆ ప్రభావం ఆహారంలోని పోషకాలను గ్రహించుకునే శోషణక్రియపై పడుతుందంటున్నారు. ఫలితంగా క్రమేణా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దాంతో గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని హెచ్చస్తున్నారు.
అదేవిధంగా, ప్రస్తుతం చాలామందిలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కూర్చుని పనిచేసేవారి సంఖ్య లక్షల్లో ఉంటున్నారు. వ్యాయామానికి దూరంగా ఉండటం, చరవాణులకు ఎక్కువగా పరిమితమవడం చేస్తున్నారు. అలాగే అధిక బరువు, మద్యపానం, ధూమపానానికి అలవాటు పడటం, తీవ్ర ఒత్తిడికి గురవడం, వేపుళ్లు, జంక్‌ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి నేడు ఎక్కువ మందిలో బీపీ, షుగర్‌తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే - షుగర్ గా అనుమానించాల్సిందేనట!