తెలంగాణ

telangana

ETV Bharat / health

కొవిడ్ సోకిన చిన్న పిల్లల్లో టైప్-1 షుగర్​ లక్షణాలు! - COVID 19 Type 1 Diabetes

Type 1 Diabetes Symptoms In Children : కరోనా బారినపడ్డ చిన్న పిల్లల్లో టైప్​-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు త్వరగా బయటపడతాయని జర్మన్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనాల్లో తేలింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

COVID 19 Type 1 Diabetes
COVID 19 Type 1 Diabetes (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 9:59 AM IST

Type 1 Diabetes Symptoms In Children: కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో టైప్‌-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది. కరోనా ఉద్ధృతంగా సాగిన కాలంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధరణ రేటు చాలా ఎక్కువగా ఉందని జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు.

షుగర్ ఎలా వస్తుంది?
టైప్‌-1 మధుమేహం అనేది ఆటోఇమ్యూన్‌ రుగ్మత. దీనిని సింపుల్​గా వివరించి చెప్పాలంటే, వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక వ్యవస్థ అదపు తప్పి, ఆరోగ్యంగా ఉన్న స్వీయ కణాలు, అవయవాలపైనే దాడి చేయటం జరుగుతుంది. ఇటువంటి వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వీరికి చికిత్స కోసం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నప్పుడు, ఐలెట్‌ ఆటోయాంటీబాడీలు ఉత్పత్తి అవుతుంటాయి. కనుక రక్త నమూనాలో వీటి ఉనికి ఆధారంగా టైప్‌-1 మధుమేహాన్ని వైద్యులు గుర్తిస్తారు.

కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్‌ ఆటోయాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు ఇంతకు ముందు చేసిన పరిశోధనల్లో తేలింది. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు మరో అంశాన్ని కొనుగొన్నారు. ఐలెట్‌ ఆటోయాంటీబాడీలు ఇప్పటికే కలిగిన (టైప్‌-1 మధుమేహం ఆరంభ దశలో ఉన్న) చిన్నారులు కరోనా బారినపడితే, వారిలో టైప్‌-1 మధుమేహ (షుగర్​) వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కనుగొన్నారు.

వాయు కాలుష్యంతో డయాబెటిస్
Air Pollution Impact Diabetes : వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్, గుండెపోటు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని మనకు తెలుసు. అయితే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల చేసిన అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కాఫీ తాగితే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే! - Coffee Side Effects

షుగర్ పేషెంట్లకు గుడ్​న్యూస్- ఈ కొత్త మందుతో నెలల వ్యవధిలో డయాబెటిస్​ కంట్రోల్! ఇక ఇంజక్షన్​తో పనిలేదు! - insulin production research

ABOUT THE AUTHOR

...view details