తెలంగాణ

telangana

ETV Bharat / health

హెల్దీ, గ్లోయింగ్ స్కిన్ కావాలా? - "చాక్లెట్​"తో ఇలా చేశారంటే నిగనిగలాడే చర్మం మీ సొంతం!

చలికాలంలో చర్మం సమస్యలకు సూపర్ స్కిన్ కేర్ ట్రీట్​మెంట్ - ఇలా చేశారంటే అందం, ఆరోగ్యం!

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Chocolate Massage for Glowing Skin
Chocolate Massage (ETV Bharat)

Chocolate Massage for Glowing Skin :కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం కామన్. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోనే రకరకాల సౌందర్యపరమైన చిట్కాలు ఫాలో అవుతే.. మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. అందులో ఎక్కువ మందిని డ్రై స్కిన్ ప్రాబ్లమ్​ ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటుంది. అలాంటి టైమ్​లో "చాక్లెట్ మసాజ్" చాలా బాగా సహాయపడుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అసలేంటి.. చాక్లెట్​ మసాజ్? ఇది చర్మ సౌందర్యాన్ని మెరిపించడంలో ఏవిధంగా తోడ్పడుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మం ప్రకాశవంతంగా మెరవాలన్నా, నిర్జీవమైపోయిన చర్మాన్నితిరిగి పునరుత్తేజితం చేయాలన్నా అది శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడం వల్లనే సాధ్యమవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకు.. సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లలో ఒకటైన "చాక్లెట్ మసాజ్" చక్కగా తోడ్పడుతుందంటున్నారు. ఈ మసాజ్​లో డార్క్ చాక్లెట్​తో పాటు ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్​ని కూడా కలుపుతారు. అప్పుడు ఆ మిశ్రమంతో శరీరమంతా మర్దన చేయడం ద్వారా బాడీలోని అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా మారుతుందని సూచిస్తున్నారు.

కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది :అంతేకాదు.. ఈ మసాజ్​లో భాగంగా వాడే డార్క్ చాక్లెట్‌లోని కొకోవా శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేస్తుంది. అవి చర్మం కింద దాగి ఉన్న కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి ఈ చాక్లెట్ మసాజ్ పొడిబారిపోయి నిర్జీవమైన శరీరాన్ని తిరిగి మునుపటి స్థితికి తీసుకురావడానికి, కండరాల నొప్పుల్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. అదేవిధంగా.. ఇలా మసాజ్ చేసే క్రమంలో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుందని చెబుతున్నారు.

2018లో "International Journal of Cosmetic Science" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. చాక్లెట్​లో ఉండే కొకోవా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల చేసి చర్మాన్ని పొడిబారకుండా కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్​లో సియోల్ నేషనల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్​లో డిపార్ట్​మెంట్ ఆఫ్ డెర్మటాలజీ విభాగంలో పనిచేసే డాక్టర్ Ji-Young Lee పాల్గొన్నారు.

మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?- కలబందతో ఇలా ట్రై చేయండి!

మలినాలను తొలగించడానికి మసాజ్! : వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మపు రంధ్రాల్లో చేరిపోయి ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతుంటాయి. మనం కొన్నిసార్లు ఎంత రుద్ది కడుక్కున్నా వాటి అవశేషాలు ఇంకా ఆ రంధ్రాల్లోనే ఉండిపోతుంటాయి. అలాంటి టైమ్​లో ఎసెన్షియల్ ఆయిల్స్​తో మసాజ్ చేయించుకోవడం వల్ల అవి తొలిగే అవకాశం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు.

ఇలా చేయడం వల్ల చర్మపు రంధ్రాల్లో ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి అవశేషాలు మెత్తబడి త్వరగా వదిలిపోయే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే.. మర్దన చేసే క్రమంలో శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది. మనసుకూ హాయిగా ఉంటుందంటున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ చర్మం ఇలా తయారవుతోందా? - ఈ చిన్న మార్పుతో మృదువుగా మెరుస్తుంది!

ABOUT THE AUTHOR

...view details