Can People with Diabetes Stop Taking Medicine :డయాబెటిస్ బాధితుల్లో కొందరు..షుగర్ లెవల్స్ నార్మల్కి రాగానే, అంతా బాగానే ఉందనే భావనతో మందులు తీసుకోవడం మానేస్తుంటారు. మరి.. మధుమేహ బాధితులు ఇలా మందులు మధ్యలో వేసుకోకపోవడం మంచిదేనా? అంటే "కాదు" కాదంటున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషీయన్ 'డాక్టర్ శ్రీనివాస్'. మందులు వేసుకోవడం ద్వారానే షుగర్ కంట్రోల్లో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్ మందులు వేసుకోవడం మానేస్తే బ్లడ్ షుగర్ స్థాయులు తప్పకుండా పెరుగుతాయని చెబుతున్నారు.
అది మన పొరపాటే!
దాదాపు షుగర్ ఉన్నవారందరిలో మెడిసిన్ తీసుకోవటం వల్లనే గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంటాయి. కొంతమంది కొన్ని నెలలు కంటిన్యుగా మందులు వాడడం వల్ల.. డయాబెటిస్ వెనక్కి మళ్లిందనీ భావిస్తుంటారు. కానీ, మధుమేహం వెనక్కి మళ్లటమనేది చాలా కొద్దిమందిలోనే జరుగుతుందట. అది కూడా జబ్బు నిర్ధరణ అయిన తొలి సంవత్సరాల్లోనే. రోజూ కచ్చితంగా మంచి జీవనశైలిని పాటించటం, బరువు తగ్గటం, మందులు వేసుకోవటం మూలంగా సాధ్యమవుతుందట. కాబట్టి, షుగర్ పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవడం మన పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వారు మధ్యలో ఆపేయవద్దు..
కొంతమంది షుగర్ బాధితులు ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మెడిసిన్ తీసుకుంటేనే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే, ఇలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వేసుకోవడం మధ్యలో ఆపేయవద్దు. ఒకవేళ మందులు తీసుకోవడం ఆపేస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మందులు మానేస్తే ఏమవుతుంది ?