తెలంగాణ

telangana

ETV Bharat / health

క్యాబేజీతో ఆరోగ్య సిరి- షుగర్​, థైరాయిడ్ సమస్యలకు చెక్​! - క్యాబేజీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Cabbage Health Benefits In Telugu : క్యాబేజీని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఇకనుంచి తినకుండా ఉండరు. క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. షుగర్, థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుందని అంటున్నారు. క్యాబేజీ తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల కోసం ఈ కథనం చదివేయండి.

Cabbage Health Benefits In Telugu
Cabbage Health Benefits In Telugu

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:06 PM IST

Cabbage Health Benefits In Telugu :క్యాబేజీని తినటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే క్యాబేజీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ ఏ, రిబోఫ్లావేట్, పోలేట్, బీ6, పీచు పదార్థాలు కూడా ఎక్కువ మొత్తంలో క్యాబేజీలో ఉంటాయి. క్యాబేజీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయులను సైతం సమతుల్యం చేస్తుంది.

క్యాబేజీల్లో శరీరానికి అవసరమైన ఫ్లావనాయిడ్ సమృద్ధిగా ఉండడం వల్ల పాంక్రియాటెక్ గ్రంథి ప్రభావాన్ని తగ్గిస్తుందని డైటీషియన్​ శ్రావ్య చెబుతున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీ తింటే పాలు బాగా పడతాయని అంటున్నారు. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా చెబుతున్నారు. అలాగే క్యాబేజీ వృద్ధాప్యానికి దారి తీసే ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుందని, కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచుతుందని పేర్కొంటున్నారు.

"జాయింట్ పెయిన్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సమస్యలు, బరువు తగ్గాలనుకునే వారు వాళ్ల రోజువారి ఆహారంలో క్యాబేజీని చేర్చుకోవాలి. విటమిన్ సి లోపంతో బాధపడేవారికి స్కిన్ డ్రై అయిపోతుంది. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ పేషంట్స్​ కూడా క్యాబేజీ తింటే మంచిది. గ్యాస్ సమస్యలతో బాధపడేవారు క్యాబేజీకి దూరంగా ఉండటమే మంచిది. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఇతర క్యాబేజీని తీసుకుంటే చాలా ఉపయోగాలున్నాయి."
--డా. శ్రావ్య, డైటీషియన్

క్యాబేజీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కడుపులో మంటను తగ్గించడంలో సాయపడుతుంది. క్యాబేజీని తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. జుట్టు పెరుగుదలకు క్యాబేజీ ఉపయోగపడుతుంది. క్యాబేజీలోని బీటా కెరోటిన్ కంటెంట్ కళ్ల లోపలి మచ్చల నివారణకు ఉపయోగపడుతుంది. క్యాబేజీలో చాలా రకాలున్నాయి. వెట్ అండ్ గ్రీన్ క్యాబేజీని పచ్చిగా లేదా ఉడికించి కూడా తినవచ్చు. రెడ్ క్యాబేజీలో అల్జీమర్ నిరోధించే లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

"క్యాబేజీ శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. క్యాబేజీలో ఫైబర్​ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. క్యాబేజీని మొత్తం ఉడికించినా అందులో 33 క్యాలరీలే ఉంటాయి. ఆంతో సైనిన్ పాలీ ఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఆక్టివిటీని కలిగి ఉంటాయి. ఇది కార్డియాక్ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో క్యాబేజీ సాయపడుతుంది." అని డైటీషియన్ శ్రావ్య తెలిపారు.

క్యాబేజీతో ఆరోగ్య సిరి- షుగర్​, థైరాయిడ్ సమస్యలకు చెక్​!

తిన్న వెంటనే కడుపులో మంటగా ఉంటోందా? కారణాలు ఇవే అంటున్న నిపుణులు!

చిన్న వయసులోనే చర్మంపై ముడతలా? - కారణాలు ఇవేనట!

ABOUT THE AUTHOR

...view details