Best Homemade Hair Masks To Prevent Hair Loss: హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవారు.. హోమ్ మేడ్ హెయిర్ మాస్క్‌లను ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని ద్వారా.. వెంట్రుకలు రాలే సమస్య తగ్గడమే కాదు.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందంటున్నారు. ఆవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎగ్ హెయిర్ మాస్క్ :గుడ్డు పోషకాల స్టోర్ హౌస్. దీనిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన విషయమే. అయితే అదే గుడ్డుతో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ను కూడా తగ్గించుకోవచ్చు. ముందుగా గిన్నెలో ఒక గుడ్డు పగలగొట్టాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బనానా హెయిర్ మాస్క్ :బనానా హెయిర్ మాస్క్ ఎలా రెడీ చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో 2 బాగా మగ్గిన అరటిపండ్లను తీసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, తేనె యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెరుగు మాస్క్ :ఇది కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలపుకోవాలి. ఆపై దాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. అలా 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత హెడ్ బాత్ చేయాలి.
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!