Best Exercises for Lower Back Pain: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి. మారిన జీవనశైలి, కూర్చునే ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక కారణాలతో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో చాలా మంది నడుము నొప్పి(Back Pain)నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వాడుతుంటారు. అయితే.. మెడిసిన్ అనేది అప్పటి వరకు ఉన్న నొప్పి నుంచి రిలీఫ్ ఇవ్వొచ్చు. కానీ.. తర్వాత ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే.. మెడిసిన్ యూజ్ చేయకుండా నిపుణులు సూచించిన ఈ నాలుగు చిన్నపాటి వ్యాయామాలు చేస్తే చాలు. ఈజీగా మీ లోయర్ బ్యాక్ పెయిన్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్లాంక్ వేయడం :లోయర్ బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధాన కారణం మనం సరైన భంగిమలో కూర్చోకపోవడం. కాబట్టి ఎప్పుడూ సరైన పోశ్చర్‌లో నిటారుగా కూర్చోడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు సరిగ్గా కూర్చోలేకపోతున్నారంటే దానికోసం ఐసోమెట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే ప్లాంక్‌లు చేయాలన్నమాట. బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్లాంక్ వేయడం చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లాంక్ వేయడం ద్వారా వెన్నుపాము దృఢంగా మారుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో కూడా ప్లాంక్ లోయర్ బ్యాక్ పెయిన్‌ని తగ్గంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది.
కండరాలను బలోపేతం చేయడం :పొత్తికడుపు కండరాలు వెన్నుపాముకు సపోర్టీవ్‌గా ఉంటాయి. కాబట్టి వీలైనంత మేరు వాటిని యాక్టివ్‌గా ఉంచాలి. అందుకోసం కాళ్లని ముందుకు లేదా వెనక్కి కదపడం, నేలపై పడుకొని మోకాళ్లని దగ్గరగా తెచ్చి అబ్స్ లాంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ఫలితంగా వెన్నునొప్పిపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చేతులను తలకు నిటారుగా పెట్టి పైకి లేచెందుకు ట్రై చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పొత్తికడుపు కండరాలతో పాటు, వెన్నుపాము స్టెబిలైజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా వెన్ను నొప్పి సమస్య తగ్గిపోతుంది.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ టాప్-7 టిప్స్ మీకోసమే!