తెలంగాణ

telangana

ETV Bharat / health

వ్యాయామం లేకుండా బరువు తగ్గాలా? - మీరు తినే ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలట!

వయసు పెరిగే కొద్దీ శరీరం శక్తిని కోల్పోతుంటుంది. అలాగే.. బరువు పెరిగిపోతుంటారు. ఈ క్రమంలో వ్యాయామం చేయాలంటే బాడీ సహకరించదు. అలాంటి టైమ్​లో ఈ ఆహార నియమాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు.

Weight Loss Diet Plan
Diet Plan for Weight Loss (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Oct 9, 2024, 3:19 PM IST

Best Diet Plan for Weight Loss :కొందరిలో వయసు పైబడే కొద్దీ శరీరంలో ఎనర్జీ తగ్గడమే కాకుండా.. బాడీ వెయిట్ కూడా పెరుగుతుంటుంది. ఈ క్రమంలోనే మోకాళ్ల నొప్పులు, వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాగే.. అధిక బరువు కారణంగా ఎక్కువ దూరం నడవాలంటే కూడా ఇబ్బందిపడుతుంటారు. ముఖ్యంగా వయసు పైబడిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటోంది. ఇలాంటి టైమ్​లో వారు బరువు(Weight) తగ్గాలంటే వ్యాయామం చేయడానికి శరీరం సహకరించకపోవచ్చు. కాబట్టి.. రోజువారి ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు న్యూట్రిషనిస్ట్ జానకీ శ్రీనాథ్. మరి, ఆ మార్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వయసు పైబడిన మహిళల్లో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో తేడాలు ఇలా కొన్ని రకాల మార్పులు కనిపిస్తుంటాయి. దీంతో తక్కువ తిన్నా బరువు పెరుగుతారని చెబుతున్నారు. అయితే, వయసు పెరిగి వ్యాయామం(Exercise)చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు కేవలం ఆహార నియమాలలో ఈ మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు.

ముందుగా బరువు తగ్గాలనుకునే వారు.. కాస్త కఠినమైన ఆహార పద్ధతులకు అలవాటు పడగలరో లేదో తెలుసుకోవాలి. ముఖ్యంగా డైలీ తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, పీచు, మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా.. ఒకపూట పొట్టు పప్పుతో చేసిన అల్పాహారం తీసుకునేలా మీ డైట్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఇక మధ్యాహ్న భోజనంలో.. చిరుధాన్యాల(అరికెలు, సామలు, కొర్రలు)తో వండిన 60గ్రాముల అన్నం, 200గ్రాముల కాయగూరలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

మహిళలు​ సడెన్​గా బరువు పెరుగుతున్నారా? - కారణాలు ఇవే - తెలుసుకుని ఈజీగా తగ్గించుకోండి!

అలాగే.. సాయంత్రం రాగిజావ, పండ్లు వంటివి స్నాక్స్​గా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు. ఇక రాత్రి డిన్నర్​లో.. మల్టీగ్రెయిన్ పిండితో చేసేచపాతీలను(Chapati)ఆకుకూరలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మీ ఎత్తు, బరువును చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి అనుగుణంగా ఏ పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకోవాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.

ఈ ఆహార నియమాలు ఫాలో అవ్వడంతో పాటు.. చక్కెరలు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వంటి వాటిన్ని ఎంత దూరం పెడితే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే.. రోజూ తగినన్ని వాటర్ తాగేలా చూసుకోవడం, మీ శరీరానికి సహకరించే కొన్ని చిన్నపాటు వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్​గా వెయిట్​ లాస్​ కావొచ్చంటున్న నిపుణులు!

ABOUT THE AUTHOR

...view details