These Beverages Might Be Better Than Coffee :చాలా మంది రోజు.. కాఫీ లేదా టీతో మొదలవుతుంది. వీరిలో ఎక్కువ మంది రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కాఫీ(Coffee) తాగుతారు. కానీ.. ఇంకొందరు మాత్రం తాగుతూనే ఉంటారు. రోజులో ఎన్నిసార్లు తాగుతారో వారికే తెలియదు. అయితే.. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా.. అతిగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కాఫీ ఒకటీ రెండు సార్లకన్నా ఎక్కువ తాగాలనిపిస్తే.. ఇతర పానీయాలను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ టీ :దీనిలో కెఫీన్ తక్కువ. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో గ్రీన్ టీ ఒకటని చెప్పుకోవచ్చు. ఇది అమైనో ఆమ్లాలు, కెఫీన్ కలయికతో ఉండి తాగగానే తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక దీనిని రోజూ తీసుకుంటే.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా బాడీకి కావాల్సిన పోషకాలను అందించడంలో కూడా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. గ్రీన్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది.
కొబ్బరి నీరు :తాజా కొబ్బరి నీరులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బాడీ కోల్పోయిన భర్తీ చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. అందుకే దీనిని ఒక మంచి హైడ్రేటింగ్ పానీయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పానీయంలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఈ వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కాఫీకి బదులుగా ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్లో పడ్డట్లే!