తెలంగాణ

telangana

ETV Bharat / health

గంటలపాటు నడవాల్సిన అవసరం లేదట - ఇన్ని నిమిషాలు వాకింగ్​ చేస్తే చాలంటున్న నిపుణులు! - HEALTH BENEFITS OF Brisk WALKING - HEALTH BENEFITS OF BRISK WALKING

Walking for Life Span: వాకింగ్​ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిసినప్పటికీ, చాలా మంది టైమ్​ లేదనో, బద్ధకం కారణంగానో నడకకు దూరంగా ఉంటారు. అయితే, డైలీ కొన్ని నిమిషాలు నడిస్తే.. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాల ముప్పుని తగ్గించవచ్చని ఓ పరిశోధన వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీ కోసం..

Benefits Of Walking
Benefits Of Brisk Walking (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 25, 2024, 5:23 PM IST

Updated : Sep 14, 2024, 7:43 AM IST

Benefits Of Brisk Walking:నేటి ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. మెజార్టీ జనాలు ఉద్యోగం, వ్యాపారం అంటూ రోజంతా బిజీబిజీగా గడుపుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఎక్కువ మంది చిన్నవయసులోనే గుండె జబ్బులు, షుగర్​, బీపీ వంటి వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల వల్ల ఎంతో మంది అకాల మరణాలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రోజూ గంటలపాటు నడవాల్సిన అవసరం లేదని.. కేవలం 11 నిమిషాలు చురుకుగా వాకింగ్​ చేస్తే చాలని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలను పరిశోధకులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

గుడ్​న్యూస్​!:ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి టైమ్​ లేదనే వారికి ఇది ఒక తీపి వార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం​ లేదనే కారణంతో చాలా మంది నడకకు దూరంగా ఉంటారు. కానీ, రోజూ 11 నిమిషాలు చురుకుగా నడిస్తే చాలు.. దీర్ఘకాలి​క వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని(రిపోర్ట్​)పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చారు. 2023లో 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజు కనీసం 11 నిమిషాలు (వారానికి 75 నిమిషాలు) నడవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 30 లక్షల మంది ప్రజల ఆరోగ్య డేటాను పరిశీలించారు. ఈ రీసెర్చ్​లో యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్​కు చెందిన 'డాక్టర్ సోరెన్ బ్రేజ్' పాల్గొన్నారు.

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ల వంటి వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. కాబట్టి డైలీ 11 నిమిషాలు చురుకుగా వాకింగ్​(Brisk Walking) చేయడం వల్ల అకాల మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు వివరించారు.

నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

  • కేవలం 11 నిమిషాలు నడవడం వల్ల బరువు తగ్గకపోవచ్చు. కానీ, ఇది క్యాలరీలు బర్న్​ చేయాడానికి కొంత తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు.
  • వాకింగ్​ చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
  • అలాగే రోజూ నడవడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా హార్ట్​ హెల్త్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనుల వల్ల ఒత్తిడిని అనుభవిస్తారు. అయితే, ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు కూర్చోకుండా కాసేపు అలా ఫాస్ట్​గా నడిస్తే స్ట్రెస్​ తగ్గుతుందని అంటున్నారు.
  • కీళ్ల నొప్పులతో బాధపడేవారు నడక వల్ల కొంత మేర ఉపశమనం పొందవచ్చు.
  • వాకింగ్​ చేయడం వల్ల మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డైలీ కొంత సేపు నడవడం వల్ల రాత్రి చక్కగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

"ఆరోగ్యానికి 10 వేల అడుగులు" - ఈ కాన్సెప్ట్​ నిజంగా మంచిదేనా? - రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు!

వయసును బట్టి నడక - మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?

Last Updated : Sep 14, 2024, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details