Benefits of Eating Raw Mango : మూమూలు పండ్లతో పోల్చితే సీజనల్గా దొరికే వాటికి ధరతో పాటు డిమాండ్ కూడా ఎక్కువే. ఎందుకంటే తక్కువ కాలం లభించే ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ కాలంలోనే తప్పకుండా తినాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అలాంటి వాటిల్లో వేసవి కాలంలో దొరికే మామిడిపండ్లకు డిమాండ్ మరీ ఎక్కువ. రకరకాలుగా దొరికే వీటిని ఇష్టపడని వారంటూ లేకపోవడం కూడా ఇందుకు కారణం. మామిడి పండ్లు మాత్రమే కాదు.. పచ్చి మామిడికాయలు కూడా ఇష్టపడుతుంటారు. పచ్చి మామిడికాయను పప్పులో వేసుకోవడం, పచ్చడి చేసుకుని తినడం లాంటివి చేస్తుంటాం. అంతే కాదు పచ్చి మామిడికాయను తినడం వల్ల కలిగే లాభాలు కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
విటమిన్-సీ
పచ్చి మామిడికాయల్లో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది బాగా సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలను తినడం వల్ల వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చట.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మామిడికాయల్లోని పచ్చిదనం జీర్ణ ఎంజైముల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడి అజీర్తి, ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. పచ్చిమామిడికాయలను నేరుగా తినడం వల్ల వేసవి కాలంమంతా జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండచ్చు.
శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
పచ్చి మామిడికాయల్లో శరీరాన్ని చల్లబరిచే లక్ఝణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి వేసవి వేడి కారణంగా వచ్చే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పచ్చి మామిడికాయలతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. వేసవి వేడి నుంచి కాపాడుకునేందుకు చక్కగా ఉపయెగపడుతుంది.
రోగనిరోధక శక్తి
విటమిన్-సీతో పాలు విటమిన్ ఏ,ఈ లాంటి పోషకాలు, బీటా కెరోటీన్, క్వెర్సెసిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి మామిడికాయలో మెండుగా లభిస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.