Benefits Of Chewing Curry Leaves With Empty Stomach : ఉదయాన్నే కరివేపాకులను నమలడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందని అంటున్నారు. అలాగే.. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
విషతుల్యాలను తొలగిస్తుంది :
కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం నుంచి బరువు తగ్గేవరకు - కివీతో ప్రయోజనాలు ఎన్నో!
చక్కెర స్థాయులు అదుపులో :
మార్నింగ్ ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల షుగర్ బాధితులు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చూసుకోవచ్చంటున్నారు. 2013లో "Journal of Clinical and Translational Research" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు రోజుకు రెండుసార్లు 10 కరివేపాకు ఆకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాబెటాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ రావు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన బరువు :
కరివేపాకులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. ఫలితంగా ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.