తెలంగాణ

telangana

ETV Bharat / health

ప్రెగ్నెన్సీ తర్వాత అందం తగ్గిపోయిందా? - ఈ టిప్స్‌ పాటిస్తే మీ బ్యూటీని తిరిగి పొందొచ్చు! - Beauty Tips After Delivery

Beauty Tips After Pregnancy : డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయుల్లో మార్పులు రావడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారి అందం కూడా దెబ్బతింటుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటించడంతో మహిళలు తమ అందాన్ని కాపాడుకోవచ్చని నిపుణులంటున్నారు. ఆ టిప్స్‌ ఏంటో మీకు తెలుసా ?

Beauty Tips
Beauty Tips After Pregnancy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 3:12 PM IST

Beauty Tips After Delivery :ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అవి శారీరకంగా, మానసికంగా, సౌందర్యపరంగా ప్రభావం చూపుతాయి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లుల శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయులు ఒక్కసారిగా పడిపోవడం వల్ల ఈ మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. అయితే, కొత్తగా తల్లైన వారికి సౌందర్యపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి ? అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

  • డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయుల్లో తేడాల వల్లజుట్టు రాలడం ఎక్కువవుతుంది. ఈ సమస్య 6 నుంచి 12 నెలల పాటు ఎక్కువగా ఉంటుందని నిపుణులంటున్నారు.
  • డెలివరీ తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, అలసట.. వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి.
  • ప్రసవానంతరం సౌందర్యపరంగా వచ్చే మరో సమస్య పిగ్మెంటేషన్‌ లేదా మెలస్మా. ఈ క్రమంలో స్కిన్‌పై నల్లటి ప్యాచుల్లాంటి మచ్చలు ఏర్పడుతుంటాయి.
  • బిడ్డ జన్మించిన తర్వాత నిద్రలేమి, హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, విపరీతమైన అలసట.. వంటివన్నీ కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి దారితీస్తాయి.
  • ప్రెగ్నెన్సీ టైమ్‌లో సహజంగానే నెలలు నిండుతున్న కొద్దీ క్రమంగా బరువు పెరుగుతారు. దీనివల్ల రొమ్ములు, పొట్ట, పిరుదులు.. తదితర శరీర భాగాల్లో పెరుగుదల కనిపిస్తుంది!
  • ఈ క్రమంలో స్కిన్‌ సాగి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడుతుంటాయి. అయితే ప్రసవం తర్వాత ఈ భాగాలన్నీ ఒక్కసారిగా తిరిగి సాధారణ స్థితికి రావడంతో అక్కడి చర్మం వదులుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలర్ట్ : మహిళల్లో పక్షవాతం, బీపీ, షుగర్​ - వీటన్నింటికీ ఆ ఒక్క తప్పే కారణం!

పరిశోధన వివరాలు..

2018లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో.. డెలివరీ తర్వాత మొటిమలతో బాధపడుతున్న మహిళలు, రోజుకు రెండుసార్లు సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల తీవ్రత, సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రి, చర్మవ్యాధి నిపుణుడు 'డాక్టర్ హ్యూన్-కిమ్ కిమ్' పాల్గొన్నారు. రోజుకు రెండుసార్లు సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల డెలివరీ తర్వాత మొటిమలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ చిట్కాలు పాటించండి!

  • ప్రెగ్నెన్సీ తర్వాత మొటిమల సమస్యతో బాధపడే మహిళలు.. డైలీ రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
  • అలాగే ఫేస్‌ప్యాక్స్‌లో కలబంద, యూకలిప్టస్‌ ఆయిల్‌.. వంటి పదార్థాలను యాడ్‌ చేసుకోండి.
  • బయటికి వెళ్లేటప్పుడు ఆయిల్‌ రహితమైన మాయిశ్చరైజర్‌ రాసుకోండి.
  • పిగ్మెంటేషన్ సమస్యను తొలగించుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకమైన మాయిశ్చరైజర్స్‌ లభిస్తున్నాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడండి.
  • అలాగే పసుపు-నిమ్మరసం, కలబంద గుజ్జు, బంగాళాదుంప, కమలాఫలం తొక్కల పొడి.. వంటివి మీరు వాడే ఫేస్‌ప్యాక్స్‌లో చేర్చుకోండి.
  • కంటి అలసటను, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి వీలైనప్పుడు విశ్రాంతి తీసుకోండి. పాపాయి పడుకున్నప్పడు మీరు కూడా పడుకోండి.
  • కొంతమంది మహిళలు గర్భం ధరించిన సమయం నుంచే.. స్ట్రెచ్‌మార్క్స్‌ రాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో నిపుణులు సూచించిన ఆయిల్స్‌, క్రీమ్స్‌.. వంటివి ఉపయోగిస్తుంటారు.
  • అయితే.. డెలివరీ ఒకవేళ స్ట్రెచ్‌మార్క్స్‌ సమస్య తలెత్తినా ఇవే చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే క్రీమ్స్‌ వల్ల సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం.
  • కానీ.. క్రీమ్స్‌/ఆయిల్స్‌తో పాటు చక్కటి సమతుల ఆహారం, బ్రిస్క్‌ వాక్‌ - యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు!

మీ పెదాల చుట్టూ ఇలా నల్లగా మారిందా? - ఇలా చేస్తే పాలరాతి అందం మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details