Ayurvedic Treatment for Fertility:ప్రస్తుత ఆధునిక యుగంలో బిజీ లైఫ్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. సంతానం కలగకపోవడం వల్ల భార్యభర్తలతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంతాన సౌఫల్య కేంద్రాలతో పాటు అనేక మందులు వాడుతుంటారు. అయితే, ఈ సమస్యకు ఆయుర్వేద పద్ధతిలో చక్కటి పరిష్కార మార్గం ఉందని నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. మరి ఈ ఔషదం ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల అశ్వగంధ చూర్ణం
- 50 గ్రాముల విదారి కంద చూర్ణం
- 50 గ్రాముల యష్టి మధు చూర్ణం
- 50 గ్రాముల శతావరి చూర్ణం
- ఒక కప్పు గోరువెచ్చటి పాలు
- అర చెంచా పటిక బెల్లం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో అశ్వగంధ, విదారి కంద, యష్టి మధు, శతావరి చూర్ణం పోసి బాగా కలపాలి.
- ఆ తర్వాత 3-5 గ్రాముల మిశ్రమం తీసుకుని అందులో గోరువెచ్చటి పాలు, పటిక బెల్లం వేసి మరోసారి కలపాలి.
- గర్భధారణకు ఆరు నెలల ముందు నుంచి ప్రతిరోజు ఉదయం దంపతులిద్దరూ తాగాలని చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చక్కటి వీర్య, అండ కణాలు ఉత్పత్తై ఆరోగ్యవంతమైన సంతానం కలుగడానికి సహాయ పడుతుందని వివరిస్తున్నారు.
అశ్వగంధ: పురుష, మహిళల్లో కణాలు ఉత్పత్తి కావడానికి ఎంతో సాయం చేస్తుందని చెబుతున్నారు. ఇంకా ఆరోగ్యవంతమైన కణాలు పుట్టేలా చేస్తుందని అంటున్నారు.
విదారి కంద: ఇది వీర్య, అండ కణాలు ఆరోగ్యంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఇంకా ఇవి రెండు సంయోగం చెంది గర్భం దాల్చేలా సహాయ పడుతుందని వివరిస్తున్నారు.