Ayurvedic Diet For Stomach Worms : కొంతమంది పిల్లలు మూడు పూటలా చక్కగా తింటున్నా సరే.. ఏమాత్రం బరువు పెరగకుండా ఉంటారు. వీరిలో ఆకలి కూడా చక్కగానే ఉంటుంది. అయినా శారీరకంగా, మానసికంగా బలహీనంగా కనిపిస్తుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితి పొట్టలో నులిపురుగులున్నప్పుడే ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని ఇవి తినేస్తుంటాయని.. దీంతో వారిలో ఎదుగుదల ఆశించినంతగా ఉండదని తెలిపారు. అయితే, ఆయుర్వేదం ప్రకారం తయారు చేసే ఒక పథ్యాహారం తీసుకోవడం వల్ల చాలా త్వరగా నులిపురుగులను నివారించవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి అంటున్నారు. మరి ఆ పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
పథ్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు:
- ఉసిరికాయ చూర్ణం- చెంచా
- తానికాయ చూర్ణం-చెంచా
- కరక్కాయ చూర్ణం -చెంచా
- దంపుడు బియ్యం పొడి- 3 చెంచాలు
- ఆవనూనె- 2 చెంచాలు
- నీళ్లు -గ్లాసు
తయారీ విధానం:
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి అందులో వాటర్ పోసి మరగనివ్వాలి.
- నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ చూర్ణం వేసుకుని బాగా కలపాలి. మీకు ఉసిరికాయలు తాజావి దొరికితే వాటిని మెత్తగా చేసుకుని తీసుకోవచ్చు.
- ఈ మిశ్రమాన్ని సన్నని మంటమీద చిక్కగా మారేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు దంపుడు బియ్యం పొడి వేసి కలపాలి.
- పిండి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి.
- ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకోవాలి. తర్వాత పిండిని చేతితో చిన్న రొట్టెలుగా చేసుకుని పెనంపై వేసుకోవాలి.
- వీటిపై కొద్దిగా ఆవనూనె వేసుకుని రెండువైపులా బాగా కాల్చుకోవాలి.
- అంతే ఇలా చేసుకుంటే నులిపురుగుల నివారణకు ఎంతోగానో ఉపయోగపడే పథ్యాహారం మీ ముందు ఉంటుంది.
- నులిపురుగుల సమస్యతో బాధపడేవారు ఈ పథ్యాహారాన్ని సాయంత్రం స్నాక్లాగా వారం రోజుల పాటు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని డాక్టర్ గాయత్రీ దేవి చెప్పారు. పిల్లలు 3 రొట్టెలు, పెద్దలు 5 రొట్టెలు తీసుకోవడం వల్ల నులిపురుగులను నివారించవచ్చని అంటున్నారు.
ప్రయోజనాలు:
ఉసిరి:ఉసిరిలో ఉండే రసాయనాలు పొట్టలో ఉండే పురుగులకు అనుకూలంగా లేని వాతావరణాన్ని ఏర్పరుస్తాయని వివరించారు.