Ayurveda Tips For Hangover Relief : ప్రతి మనిషికి తలనొప్పి అనేది సాధారణమైన సమస్య. తలనొప్పి బాధిస్తున్నప్పుడు ఏ పనిని చెయ్యడానికి ఇష్టపడరు. అలాగే కొంతమంది వికారం, హ్యాంగోవర్, అలసటకు గురవుతుంటారు. అయితే కొందరు వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంగ్లిష్ మందులవైపు మొగ్గు చూపిస్తే మరికొందరు ఆయుర్వేద చిట్కాలను పాటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఆయుర్వేద శాస్త్రంలో చక్కని ఇంటి చిట్కాలను సూచించారు. మరి ఆ చిన్ని చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
లెమన్ వాటర్
సాధారణంగా శరీరంలో డీహైడ్రేషన్ వల్ల హ్యాంగ్ఓవర్, అలసట లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి సమయాల్లో గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పై సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. అంతేకాకుండా మీ బాడీని డీటాక్సిఫై చేస్తుంది.
హెర్బల్ టీ
అల్లం టీ, సోంపు టీ, పుదీనా టీ లాంటి హెర్బల్ టీలను తాగడం ద్వారా తలనొప్పి, వికారం, హ్యాంగ్ఓవర్, అలసట సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరినీళ్లు
హ్యాంగోవర్ లేదా వికారంగా ఫీల్ అయ్యే వారికి కొబ్బరినీళ్లు ఓ మంచి డ్రింక్. అప్పటికప్పుడు కొట్టించిన కొబ్బరిబోండా నీళ్లను తాగడం వల్ల అందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫలితంగా హ్యాంగోవర్ మాయం అవడమే గాక వికారం తొలగిపోతుంది. అలసట అనేది దరిచేరదు.
అల్లం నీళ్లు
తలనొప్పి, వికారం, హ్యాంగోవర్‌తో బాధపడుతున్న వాళ్లు అల్లం నీళ్లలో కాస్త నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగవచ్చు. దీంతో మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ దొరుకుతుంది.