Avoid These Food Combinations for Weight Loss: బరువు పెరగడం అనేది ఆరోగ్యం మీదనే కాదు.. అందంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక బరువు కారణంగా.. గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, లివర్ సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, అధిర రక్తపోటు, జీర్ణ సమస్యలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఇబ్బందులూ వస్తాయి. అటు బ్యూటీని కూడా దెబ్బ తీస్తుంది. కాబట్టి అధిక బరువును కంట్రోల్లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం డైట్ పరంగా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలే తీసుకోకూడదని చెబుతున్నారు.
లంచ్ బదులు ఈ సలాడ్లు ట్రై చేస్తే - ఈజీగా బరువు తగ్గుతారు!
అన్నం+ఆలుగడ్డ :ఆలుగడ్డ చాలా మందికి ఇష్టమైన కర్రీ. అయితే దీనిని అన్నంతో కలిపి తినడం ద్వారా బరువు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు నిపుణులు. రైస్‌లో అత్యధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఇందులో స్టార్చ్ అధికంగా ఉంటుంది. వీటిని అన్నంతో కలిపి తీసుకున్నప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. తప్పనిసరి అయితే.. తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఓట్స్+డ్రై ఫ్రూట్స్ :బరువు తగ్గాలనుకునే వారిలో చాలా మంది ఓట్స్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. ఇందులో చక్కెర స్థాయులు తక్కువగా ఉండడమే అందుకు కారణం. అయితే.. కొంతమంది ప్రొటీన్స్ కోసం ఓట్స్, డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటారు. దీని వల్ల బరువు తగ్గడం అటుంచితే.. బరువు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి!