తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ ఆహారాలు కలిపి తింటున్నారా? - ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడేసుకున్నట్టే! - Avoid These Food Combinations - AVOID THESE FOOD COMBINATIONS

Avoid These Food Combinations: కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. వాటిని మరొక ఆహారంతో కలిపి తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా డేంజర్. ఇదే విషయాన్ని ప్రముఖంగా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి.. ఎప్పటికీ తినకూడదని ఆ ఫుడ్​ కాంబినేషన్స్ ఏంటో మీకు తెలుసా?

Avoid These Food Combinations
Avoid These Food Combinations (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 10:55 AM IST

Avoid These Food Combinations for Good Health:ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల ఆహారాలూ ముఖ్యమే. కానీ.. వాటిలో కొన్నింటిని కలిపి తీసుకోవటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కొన్ని ఫుడ్​ కాంబినేషన్స్​ అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఆ ఫుడ్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఐస్ క్రీం, గులాబ్ జామూన్:ఐస్​క్రీమ్​, గులాబ్ జామూన్ కాంబినేషన్​ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇది చాలా ఫేమస్​ ఫ్యూజన్ డెజర్ట్. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం కచ్చితంగా మానేయాలని ఆయుర్వేదం చెబుతోంది. వీటిని కలిపి తింటే.. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రెండింటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల బరువు పెరగవచ్చని చెబుతున్నారు. అలాగే ఐస్​క్రీం, గులాబ్ జామూన్ రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని అంటున్నారు.

భోజనంతో టీ:భోజనం తినే ముందు, తిన్న తర్వాత చాలా మంది టీ, కాపీ తాగుతుంటారు. అయితే ఈ ఫుడ్​ కాంబినేషన్​ కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. టీ, కాఫీలో కెఫీన్‌, టానిన్లు ఉంటాయి. కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థపై.. టానిన్‌ ఆహారంలో ఉండే ఐరన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్‌ శాతాన్ని టానిన్‌ తగ్గిస్తుందని చెబుతున్నారు.

అసలు పైల్స్​ ఎందుకొస్తాయి? - రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - Piles Symptoms and How to Cure

పండ్లు, పాలు :చాలా మంది పండ్లు, పాలు కలిపి తీసుకుంటుంటారు. మరికొంతమంది స్మూతీలు, మిల్క్​షేక్​లుగా తయారు చేసుకుంటుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ పదార్థాలు కలిపి తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొందరిలో ఇవి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తాయని, పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుకుంటాయని అంటున్నారు. అయితే ఈ సమస్య వ్యక్తిగత జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

పాలక్, పనీర్​:పాలక్ పనీర్.. ఈ ఫుడ్​ కాంబినేషన్​కు చాలా మంది ఫ్యాన్స్​ ఉంటారు. ఇది పాపులర్​ వెజ్​ వంటకం కూడా. అయితే ఈ రెండింటిని కలిపి తినకూడదని ఆయుర్వేదం సలహా ఇస్తోంది. ఎందుకంటే పాలకూరలోని పలు పోషకాలు.. పనీర్‌లోని కాల్షియం శోషణాన్ని అడ్డుకుంటాయని అంటున్నారు. 2009లో జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పాలకూర, పనీర్ కలిపి తినడం వల్ల పనీర్​లోని కాల్షియం శోషణ 50% వరకు తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోషకాహార నిపుణుడు డాక్టర్ జియాన్‌జున్ లీ పాల్గొన్నారు. పాలకూరలోని ఆక్సిలేట్లు పనీర్​లోని​ కాల్షియం శోషణ (absorption) ను తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea

డేట్స్​, పాలు: కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని, ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని కలిపి తినడం వల్ల.. శరీరంలో ఐరన్​ను గ్రహించే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పాలలోని కాల్షియం.. ఐరన్​ శోషణ(absorption)ను కొంత మేర అడ్డుకుంటుందని అంటున్నారు. అంతేకాదు.. కొంతమందికి డేట్స్​, పాలు కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని అంటున్నారు.

చేపలు, పాలు:చేపలు, పాలు కలిపి తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ పేరుకుపోతాయని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'డబుల్ చిన్​'తో ఇబ్బందిపడుతున్నారా? - ఇలా సింపుల్​గా​ మాయం చేయండి!! - Double Chin Reduce Exercises

దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్‌ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి! - cleaning teeth techniques

ABOUT THE AUTHOR

...view details