తెలంగాణ

telangana

ETV Bharat / health

ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇడ్లీ/దోశ పిండి పులిసిపోతుందా ? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి - పైగా టేస్టీ కూడా! - Over Fermentation of Idli and Dosa - OVER FERMENTATION OF IDLI AND DOSA

Control Fermentation Of Idli Dosa Batter : వారానికి సరిపడా ఇడ్లీ, దోశ పిండిని రుబ్బుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం చాలా మంది చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఫ్రిడ్జ్‌లో ఉన్నా కూడా పిండి అధికంగా పులిసిపోతుంది. ఇలా ఎక్కువగా పులిసిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్​ పాటించమంటున్నారు నిపుణులు? అవేంటో ఇప్పుడు చూద్దాం.

Fermentation Of Idli Dosa Batter
How to Avoid Over Fermentation of Idli and Dosa Batter (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 12:37 PM IST

How to Avoid Over Fermentation of Idli and Dosa Batter :టైమ్‌ లేకపోవడం కారణంగానో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో చాలా మంది మహిళలు ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ, దోశ పిండిని రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా.. ఈ పిండి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గానే ఉంటుందనుకుంటారు. కానీ, ఫ్రిడ్జ్‌లో పిండి పెట్టినప్పటికీ దానిని రోజుల తరబడి ఉపయోగించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులంటున్నారు. ఎందుకంటే.. పిండిని ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేసినా కూడా పులిసే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. దీనివల్ల పిండి ఎక్కువగా పులిసిపోతుంది. అయితే, రుబ్బుకున్న ఇడ్లీ, దోశ పిండి ఎక్కువగా పులియకూడదంటే కొన్ని టిప్స్‌ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిండి పులిసిపోవడానికి ఎంత టైమ్ పడుతుంది ?:వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నైట్‌ పిండిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దానంతటదే పులుస్తుంది. అదే కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు పిండి పులియడం కోసం కొంతమంది ముందే కాస్త బేకింగ్‌ సోడా కలుపుతుంటారు. అయితే పిండి ఎక్కువగా పులిసిందా? సాధారణంగానే పులిసిందా? అనే విషయాలు టెక్స్చర్‌ని బట్టి తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే.. పిండి మరీ చిక్కగా మారినా, మరీ పల్చగా మారినా.. ఎక్కువగా పులిసినట్లు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పిండితో చేసి ఇడ్లీ లేదా దోశలు.. గట్టిగా మారడంతో పాటు, అంత రుచిగా ఉండవని అంటున్నారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి! :అతిగా పులిసిన పిండిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్‌.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పిండి టెక్స్చర్‌లో మార్పులతో పాటు.. నోటికి పుల్లగా తగిలినా, వాసనలో తేడాలొచ్చినా, పిండి ఉపరితలంపై నూనెలాంటి లేయర్‌ ఏర్పడినా.. ఇలాంటి పిండిని బయటపడేయడమే మంచిదని పేర్కొన్నారు. వీలైతే పిండి రుబ్బిన 24 గంటల్లోనే దాన్ని పూర్తిగా వాడేయాలని.. అలాగే ఎప్పటికప్పుడూ ఫ్రెష్‌గా తయారు చేసుకోవడమే మేలంటున్నారు.

రాత్రివేళ పప్పు నానబెట్టాల్సిన పనిలేదు - ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు!

ఇడ్లీ/దోశ పిండి ఎక్కువగా పులియకుండా ఈ చిట్కాలు పాటించండి..

  • ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు పిండి నాలుగ్గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్‌ బయటే ఉంచకుండా.. మధ్యమధ్యలో చెక్‌ చేస్తుండాలి. అదే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచినా అది పులవదు. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు లెక్క. కాబట్టి, అప్పుడు పిండిని తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే సరిపోతుంది.
  • ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల పిండి ఎక్కువగా పులుస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఉప్పు రుచికి సరిపడ మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. 2018లో 'జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇడ్లీ పిండి పులియడంపై ఉష్ణోగ్రత, ఉప్పు ప్రభావం ఉంటందని నిపుణులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR)కు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఉప్పు తక్కువగా వేస్తే.. నెమ్మదిగా పులుస్తుందని.. ఎక్కువగా వేస్తే వేగంగా పులిసిపోతుందని ఆయన పేర్కొన్నారు.
  • పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోశలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో.. కొంతమంది నిద్ర లేవగానే పిండి గిన్నెను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయటపెట్టేస్తారు. దీనివల్ల కూడా అధికంగా పులిసే ప్రమాదం ఉందట. కాబట్టి అవసరమున్నప్పుడే పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • మోతాదుకు మించి మినప్పప్పు వాడినా పిండి అధికంగా పులిసే అవకాశం ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి దీన్ని ఎక్కువగా వేయకుండా చూసుకోవాలి.
  • మెంతులు కూడా పిండి పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి దోశ పిండిలో వీటిని ఎక్కువగా వాడకపోవడం మంచిది.
  • ఈ టిప్స్‌ పాటించడం వల్ల పిండి అధికంగా పులిసిపోకుండా చూసుకోవచ్చు.

ఎన్ని తిన్నా బరువు పెరగరు- ఇడ్లీతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్- కొత్తగా చేసుకోండిలా! - World Idli Day 2024

కాస్త భిన్నంగా 'గ్రీన్​ మసాల ఇడ్లీ' వడ్డించండిలా..!

ABOUT THE AUTHOR

...view details