తెలంగాణ

telangana

ETV Bharat / health

చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందా? ఇది తాగితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చట!

-ఆస్థమాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్నారా? -ఆస్థమా తగ్గడానికి ఆయుర్వేద పద్ధతిలో ఔషధం!

Asthma Treatment in Ayurveda
Asthma Treatment in Ayurveda (Getty Images)

By ETV Bharat Health Team

Published : 5 hours ago

Asthma Treatment in Ayurveda:చలికాలంలో సాధారణ వ్యక్తులకే జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇంకా ఆస్తమా బాధితులైతే, చలికాలంలో ఇంకాస్త ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిగతా కాలాలతో పోల్చినపుడు ఈ ఇప్పుడు చల్లని వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్థమా ఉద్ధృతం అవుతుంది. ఫలితంగా ఊపిరి సరిగా అందకా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ ఈ ఆయుర్వేద ఔషధాన్ని తీసుకుంటే చలికాలంలోనూ ఆస్థమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గాయత్రీ దేవీ వివరిస్తున్నారు.

కావాల్సిన పదార్థాలు

  • 50 గ్రాముల అడ్డసరం ఆకుల చూర్ణం
  • 25 గ్రాముల తిప్ప తీగ చూర్ణం
  • 25 గ్రాముల పసుపు
  • 25 గ్రాముల వాకుడు కాయల చూర్ణం
  • 25 గ్రాముల మిరియాల పొడి

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించి ఓ గిన్నెలో గ్లాసు నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
  • మరో గిన్నెను తీసుకుని అందులో అడ్డసరం ఆకుల చూర్ణం, పసుపు, తిప్ప తీగ, వాకుడు కాయల చూర్ణం, మిరియాల పొడి వేసి కలపాలి.
  • నీళ్లు బాగా వేడయ్యాక ముందుగా కలుపుకొన్న మిశ్రమాన్ని ఇందులో వేసి మరిగించుకోవాలి.
  • ఇప్పుడు జల్లితో దీనిని వడపోసుకుని పక్కకు పెట్టుకుంటే ఆస్థమా ఔషధం రెడీ!

ఎలా తీసుకోవాలి?
ఆస్థమాను తగ్గించే ఈ ఔషధాన్ని 30-40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం, సాయంత్రం తీసుకోవాలని డాక్టర్ గాయత్రీ దేవీ సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఆస్థమాతో బాధపడేవారు ఎప్పటికప్పుడూ తాజాగా కషాయాన్ని తయారు చేసుకుని తాగాలని చెబుతున్నారు.

అడ్డసరం ఆకుల చూర్ణం: ఇది దగ్గు, ఆయాసం, ఆస్థమా లాంటి సమస్యలకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యురాలు గాయత్రీ దేవీ చెబుతున్నారు.

తిప్ప తీగ చూర్ణం: ఇది ఆస్థమాతో బాధపడే వారికి వాత దోషాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు. దగ్గు, ఆయాసం తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

పసుపు: పసుపును అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆస్థమాతో వచ్చే ఎలర్జీలను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

వాకుడు కాయలు చూర్ణం: ఇది ఆస్థమా తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు.

మిరియాల పొడి: మిరియాలు ఆస్థమాను తగ్గించడానికి చాలా సాయం చేస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కఫాన్ని మిరియాలు బాగా తగ్గిస్తాయని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇకపై ఒత్తిడి, ఆందోళనకు చెక్! ఈ 3-3-3 రూల్ పాటిస్తే స్ట్రెస్ రిలీఫ్ పక్కా!

డ్రై ఫ్రూట్స్​ నానబెట్టాలా? పచ్చిగా తినాలా? ఎలా తీసుకుంటే మంచిది?

ABOUT THE AUTHOR

...view details