ETV Bharat / offbeat

"పూర్ణం బూరెలు" ఎప్పుడైనా చేసుకోండి - పూర్ణం బయటకి రాకుండా ఈ టిప్స్ పాటించండి

- పండగ వేళల్లోనే కాదు.. ఎప్పుడు తినాలనిపించినా ఇలా ప్రిపేర్ చేయండి

How to Make Poornam Boorelu
How to Make Poornam Boorelu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Poornam Boorelu : చాలా మంది ఇంట్లో పూజలు చేసినప్పుడు దేవుడికి నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పిస్తుంటారు. ఇంకా పండగలు, శుభకార్యల సమయంలోనూ వీటిని చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే.. సాధారణ సమయాల్లోనూ పిల్లలకు రుచికరంగా వీటిని చేసి పెట్టొచ్చు. కానీ.. అందరికీ పర్ఫెక్ట్​గా పూర్ణాలు చేయడం రాదు. కొన్నిసార్లు ట్రై చేసినా.. పూర్ణం బయటకి వచ్చేస్తుంది. అందుకే ఈ టిప్స్ మీకోసం. ఈ స్టోరీలో చెప్పిన కొలతలు​ పాటిస్తూ చేస్తే పూర్ణం బూరెలు సూపర్​గా వస్తాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి పూర్ణం బూరెలు ఎలా చేయాలో ఓ సారి చూడండి..

స్టఫింగ్​(పూర్ణం) కోసం :

  • శనగపప్పు-కప్పు
  • బెల్లం తరుగు-ఒకటిన్నర కప్పు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి - పావు టీస్పూన్
  • నీరు

కోటింగ్ కోసం :

  • మినప్పప్పు- కప్పు
  • బియ్యం- ఒకటిన్నర కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • పంచదార - 1 టీస్పూన్
  • వాటర్ - ఒకటిన్నర కప్పు
  • వంటసోడా - పావు టీస్పూన్
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో మినప్పప్పు, బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై గిన్నెలో నీళ్లు పోసి మూతపెట్టి.. 5 గంటలు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఈ రెండింటినీ మరోసారి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్​లోకి తీసుకొని చిక్కని దోశపిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి.
  • బౌల్​పై మూతపెట్టి మూడు గంటలు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు పిండి పులిసేలోపు ఒక గిన్నెలోకి శనగపప్పు తీసుకుని బాగా కడగండి. ఆపై నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోండి.
  • ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన శనగపప్పు, రెండు కప్పుల నీరు పోసుకుని 3 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి.
  • తర్వాత పప్పుని జల్లించుకోండి. శనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకుని గ్రైండ్​ చేసుకోండి.
  • గ్రైండ్​ చేసిన శనగపిండిని ఒక పాన్​లోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై మరో కడాయి పెట్టుకొని బెల్లం తరుగు, కొన్ని నీళ్లు వేసుకోండి.
  • స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగించండి. కరిగిన బెల్లం పాకాన్ని గ్రైండ్​ చేసుకున్న శనగపిండి పాన్​లో వడకట్టుకోండి.
  • ఇప్పుడు పాన్​ని స్టౌపై పెట్టి కలుపుతూ ఉండాలి. పూర్ణం బాగా గట్టిగా మారే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • ఆ విధంగా అయ్యాక యాలకుల పొడి, నెయ్యి వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని పూర్ణం కొద్దిగా తీసుకుని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.
  • ఇప్పుడు పులిసిన దోశపిండిలో కొద్దిగా ఉప్పు, చక్కెర, చిటికెడు వంటసోడా వేసి మిక్స్ చేయండి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని పూర్ణాలు వేయించడానికి సరిపడా వేసుకోవాలి.
  • ఆయిల్​ వేడయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చిన్న చిన్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకంటూ దోశపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి.
  • పూర్ణం బూరెలను రెండు వైపులా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే లోపల పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్​గా వస్తాయి.
  • నచ్చితే ఇలా ఓసారి పూర్ణం బూరెలు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

'నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి - ఈ నైవేద్యం సమర్పించండి'!

బొజ్జ గణపయ్యకు "ఉండ్రాళ్ల పాయసం" - ఇలా చేసి పెడితే వినాయకుడు ఎంతో ఆనందిస్తాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.