Apple Cider Vinegar Benefits And Side Effects : ఆపిల్స్, షుగర్, ఈస్ట్ మూడింటినీ కలిపి కొన్ని వారాల పాటు పులియబెడితే తయారయే మిశ్రమమే ఆపిల్ సైడర్ వెనిగర్. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోబయోటిక్స్ కలయికగా ఉండే దీనికి చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆహారాన్ని సంరక్షించేందుకు, సువాసన అందించేందుకు దీన్ని ఉపయెగించే వారు. దీంట్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఆపిల్ సైడర్ వినిగర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తాజాగా చేసిన కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ప్రస్తుతం చాలా మంది ఆహారాన్ని సంరక్షించేందుకు, డ్రెస్సింగ్ చేసేందుకు, పరిశుభ్రత కోసం, పండ్లు, కూరగాయలను కడిగేందుకు, ముఖానికి టోనర్‌గా, జుట్టును శుభ్రం చేయడానికి, చుండ్రును తొలగించుకునేందుకు, మౌత్ వాష్‌గా ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కలిగే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయట.
మధుమేహ నియంత్రణకు!
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 95% మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు టైప్-2 డయాబెటిస్ ఉంటోంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఉత్పిత్తి తక్కువగా ఉండటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
బ్యాక్టీరియాను!
సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి యాపిల్ సైడర్ వెనిగర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులను నాశనం చేసి వ్యాధులను అరికట్టే శక్తి దీనికి ఉంటుంది. దీంట్లోని అసిడిక్ యాసిడ్, బ్యాక్టీరిసైడ్ వంటివి ఆహార పదార్థాలలో ఈకోలీ, నోరో వైరస్లను ఏర్పడకుండా కాపాడుతుంది. ఆహార పదార్థాల్లో ఈకోలి ఉండటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయట.