తెలంగాణ

telangana

ETV Bharat / health

బాదంపప్పును తింటున్నారా? - ఇలా తింటే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు! - Soaked Vs Unsoaked Almonds - SOAKED VS UNSOAKED ALMONDS

Almonds Benefits : బాదంపప్పు అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ నట్స్ ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది. అంటే.. నానబెట్టి తినాలా? లేక పచ్చివే నేరుగా తినాలా? ఏ విధంగా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Soaked Vs Unsoaked Almonds
Almonds Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 9:55 AM IST

Soaked Vs Unsoaked Almonds :చాలా మంది రాత్రిపూట బాదం నానబెట్టుకొని ఉదయం లేవగానే తింటుంటారు. ఈ క్రమంలోనే చాలా మందికి బాదంను.. నానబెట్టుకొని తింటే మంచిదా? లేదా నేరుగా తినాలా? లేక వేయించి తినాలా? అనే సందేహాలు వస్తుంటాయి. మరి బాదంపప్పును(Almonds) ఎలా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణక్రియకు మేలు :పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదంపప్పులు జీర్ణక్రియను సులభతరం చేసే ఎంజైమ్​లను విడుదల చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

పోషకాల లభ్యత మెరుగు :బాదంపప్పును నానబెట్టడం వల్ల పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల లభ్యత పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. ఈ ప్రక్రియ లైపేస్ వంటి ఎంజైమ్‌లను విడుదల చేసి జీవక్రియ రేటును పెంచుతుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు.. పోషకాల శోషణకు ఆటంకం కలిగించే మలినాలను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు.

ఫైటిక్ యాసిడ్ తగ్గింపు : బాదంపప్పును నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఈ ప్రక్రియ కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణ(Absorption)కు ఆటంకం కలిగించే యాంటీ న్యూట్రియంట్​ను అడ్డుకొని ఆ ఖనిజాల లభ్యతను పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

2018లో 'Journal of the Science of Food and Agriculture'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాదంపప్పును నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయిలను తగ్గుతాయని, ఇది ఖనిజాల శోషణను మెరుగుపరుస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మహ్మద్ అలీ అనిసి పాల్గొన్నారు. బాదంపప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయిలు తగ్గి ఎక్కువ పోషకాలు గ్రహించడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

మలినాల తొలగింపు : అదే విధంగా బాదంను ​నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే మలినాలు తొలగిపోతాయి. అప్పుడు వాటిని పొట్టుతో సహా తినడం వల్ల శరీరానికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు అంటున్నారు.

యాంటీఆక్సిడెంట్ యాక్టివేషన్ :బాదంపప్పును నానబెట్టడం వల్ల బాదం పొట్టులో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు యాక్టివేట్ అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్​ చేయడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మొత్తం సెల్యులార్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.

బాదం ఎక్కువగా తింటున్నారా? - నిపుణులు హెచ్చరిస్తున్నారు!

భాస్వరం సమృద్ధిగా లభిస్తుంది :బాదంలో ఉండే ముఖ్యమైన ఖనిజం భాస్వరం. నానబెట్టిన తర్వాత ఇది మరింత పెరుగుతుందని.. తద్వారా ఎముకల ఆరోగ్యం, దంత సంరక్షణతో పాటు వివిధ శారీరక విధులకు దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడానికి సహాయపడే ఎంజైమ్ విడుదల : బాదంపప్పులను నానబెట్టే ప్రక్రియ లైపేస్‌తో సహా ఇతర ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఇవి కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల, నానబెట్టిన బాదం మెరుగైన జీవక్రియకు దోహదం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుందంటున్నారు.

తగ్గిన యాంటీ-న్యూట్రియెంట్ ఇంపాక్ట్ : నానబెట్టడం వల్ల బాదం పొట్టులో ఉండే టానిన్లు, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియంట్స్ ప్రభావం తగ్గుతుంది. ఇవి అధిక మొత్తంలో ఉన్నప్పుడు అవసరమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి.. బాదంను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆ ప్రభావం ఖనిజాల శోషణ సులభమవుతుందంటున్నారు నిపుణులు.

చూశారుగా.. పోషకాల స్టోర్​ హౌస్​గా చెప్పుకునే బాదంపప్పును పచ్చిగా తినడం కంటే నానబెట్టుకొని తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో. అందుకే.. నానబెట్టని బాదంపప్పు కంటే నానబెట్టిన బాదంను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బాదం తినకపోతే ఓ సమస్య - అతిగా తింటే మరో ప్రాబ్లం! - రోజుకు ఎన్ని తినాలి?

ABOUT THE AUTHOR

...view details