ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / health

కడుపులో నొప్పిగా ఉందా? - లిక్కర్​కి లివర్​కి మధ్య పోరాటమే కావొచ్చు! - alcohol vs liver - ALCOHOL VS LIVER

LIVER DETOX : కడుపులో నొప్పిగా ఉంటోందా? ఎడమ వైపు పిండేసినట్లుగా అనిపిస్తోందా? అయితే అది లివర్ సంబంధిత సమస్య కావొచ్చంటున్నారు వైద్యులు. అందరిలో అదే సమస్య కాకపోయినా మద్యం ప్రియులు మాత్రం అలర్ట్​గా ఉండాల్సిందే. మీ ప్రాణాలను ఫణంగా పెట్టి పసరు వైద్యం, కషాయాలు తాగుతూ లివర్​ ఆరోగ్యంతో ఆటలాడొద్దని హెచ్చరిస్తున్నారు.

liver_disease
liver_disease (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 1:30 PM IST

Updated : Aug 15, 2024, 3:57 PM IST

LIVER DETOX :బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్ కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో పొట్టభాగంలో ఎడమవైపు నొప్పిగా ఉంటే అది లివర్ సంబంధిత సమస్య కావొచ్చు. లివర్ సమస్యలు ఉంటే కడుపు నొప్పిగా ఉంటుంది. ఇటీవల కొంతమంది లివర్ డిటాక్స్ పేరుతో కొన్ని ఆయుర్వేద మందులు, హోమియో రెమిడీలు ప్రచారం చేస్తున్నారు. కానీ, అవి లివర్​ ఆరోగ్యంపై అంతగా ప్రభావం చూపకపోగా మరింత దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డీటాక్స్ డ్రింక్స్ అని వచ్చేవన్నీ నిజం కావంటున్నారు ప్రముఖ సర్జికల్​ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్​ ఇప్పా విమలాకర్​ రెడ్డి.

పసరు పచ్చ పానీయాలతో లివర్​ ఆరోగ్యం మెరుగుపడుతుందంటే నమ్మాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. ఎవరో చెప్పారని ఆకులు ఏరుకోడం, కడుక్కోవడం, మిక్సీ వేయడం, పిండడం అంతా టైం వేస్ట్ పని ఇని కొట్టిపారేస్తున్నారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ఎక్కువ కాబట్టి, ఆ ఆకుల్ని సరిగ్గా కడక్కపోయినా, ఉడకబెట్టకపోయినా అమీబియాసిస్ వచ్చేసి లివర్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వాటికి తోడు పాటు నులిపాములు లాంటివి కూడా పేగుల్లో పెరిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

జామపండు Vs డ్రాగన్​ ఫ్రూట్ - విటమిన్​ పోటీలో విన్నర్​ ఎవరంటే! - GUAVA VS DRAGON FRUIT

ఎవరో చెప్పారని, ఏవేవో ఔషధాలు తయారు చేసుకుని వాడుతూ ఇక వచ్చిన ఇబ్బందేమీ లేదంటూ మద్యపానం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి మారిపోతుంది. మందేసి చిందేస్తే ప్రాణాలకు ప్రమాదమే. లివర్ కి ఏదైనా విషం ఉందంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో ముందుండే పదార్థం ఆల్కహాలే. ఇన్నాళ్లూ తాగిన మందు కొవ్వులా మారి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనే వాదన ఉంది. మందు ఏమాత్రం తాగినా అది సరాసరి లివర్ కణాల్ని దెబ్బతీస్తుంది. పైగా అవి మానకుండా, కొత్తవి పుట్టకుండా, వాటి స్థానంలో ఫైబ్రోసిస్ (అంటే గట్టి పనికిరాని కణజాలాన్ని) ఏర్పరుస్తుంది. తద్వారా ఎంతో మృదువైన కాలేయం (LIVER) గట్టిపడి పోయి చివరికి పనికిరానిదిగా తయారవుతుంది.

కాలేయంలో కొవ్వు చేరడాన్నే ఫ్యాటీ లివర్​ సమస్య అంటారు. సహజంగా కాలేయంలో కొవ్వు ఉంటుంది. కానీ, అది మోతాదును మించి (5శాతం) ఉంటే దానిని ఫ్యాటీ లివర్​ అంటారు. లివర్​ లో లివర్ కణాలు మాత్రమే ఉండాలి. కానీ, కణాల మధ్య కొవ్వ చేరితే ఫ్యాటి లివర్​ అంటారు. ఆహారం, శరీర బరువు, ఆల్కహాల్, మద్యం, మధుమేహం, రక్తపోటుపై ఫ్యాటీ లివర్ సమస్య ఆధార పడి ఉంటుంది. ఇది చాప కింద నీరులా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. - డాక్టర్​ ఇప్పా విమలాకర్​ రెడ్డి, సర్జికల్​ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

లివర్​ ఆరోగ్యానికి కాచి చల్లార్చిన వడపోసిన నీటిని తాగాలి. ఆల్కహాల్ తర్వాత అంత్యంత తీవ్ర స్థాయిలో లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి హెపటైటిస్ వైరస్​లు. ఇవి కలుషిత నీటిని తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వాడేసిన సూదులను వినియోగించడం, అసురక్షిత శృంగారం మొదలైన వాటివల్ల కూడా లివర్​ దెబ్బతింటుందని కొద్ది మందికే తెలుసు. అందుకే లివర్​ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

రోజూ వ్యాయామం అలవాటు ఉన్నట్లయితే లివర్​ విషయంలో కాస్త ధైర్యంగా ఉండొచ్చు. కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గిపోతాయంటున్నారు వైద్యులు. అలాగే మిఠాయిలు, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ ఉంచిన పచ్చళ్లు లివర్​కు చేటు చేస్తాయి. అలాంటి లివర్​ విషపూరిత పదార్థాలు తగ్గించడం కంటే మానుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కలిపిన ఆహారపదార్థాలు సహజంగా దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి రంగులు వాడి బాగా మరిగించిన నూనెలో వేయించిన చికెన్ పకోడీ పూర్తిగా దూరం పెట్టాలి.

ఇతర జబ్బులకు, వ్యాధులకు ఇప్పటికే మందులు వాడుతున్నట్లయితే వాటిని కాలేయం నిర్వీర్యం చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి లివర్​పై వీలైనంత భారం తగ్గిస్తే మంచిది. వైద్యుల సిఫారసు లేకుండా అనవసర సప్లిమెంట్లు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, విటమిన్ మాత్రలు వాడకపోవడం మంచిది.

ఎవరో ఏదో చెప్పారని అనవసర కషాయాలు, గుళికలు వాడొద్దు. సాధారణంగా లివర్ని మనం ఇబ్బంది పెట్టకపోతే దాని పని అది చేసుకుంటుందని గుర్తించాలి. మనమే దానికేదో మేకప్ వెయ్యాలని ప్రయత్నిస్తే అది వికటించే ప్రమాదమే ఎక్కువ.

ముఖ్య గమనిక :ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వృద్ధాప్యం వాయిదా వేయాలనుకుంటున్నారా?- వీటిని ట్రై చేయండి! - Anti Aging best Food

నిలబడి నీళ్లు తాగుతున్నారా? - మీరు డేంజర్​లో ఉన్నట్టే! - HOW TO DRINK WATER

Last Updated : Aug 15, 2024, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details