Cold Intensity Raised in Alluri District : అసలే చలి తీవ్రత ఎక్కువగా ఉండి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కంటున్నారు. గిరిజన, కొంజ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతులు భారీగా పడిపోతున్నాయి. పొగమంచి పది దాటినా వీడటం లేదు. పిల్లులు, వృద్ధులు చలికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండ్రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జి మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి , డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారులు గ్లౌజులు వేసుకుంటే గాని బయటకు రాలేని పరిస్థితి. చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. దట్టమైన పొగ మంచుతో వాహనాలు లైట్ల వెలుతురులో ప్రయాణిస్తున్నాయి. మరో 5 రోజుల పాటు వాతావరణం శీతలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.