Risk for major cardiac arrest: గుండె జబ్బుకు పొగ తాగటం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి ముప్పు కారకాలుగా పరిణమిస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మలబద్ధకమూ కారణమవుతుందా? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజమని తాజా అధ్యయనం చెబుతోంది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకూ మలబద్ధకానికీ సంబంధం ఉంటున్నట్టు ఆ పరిశోధనలో తేలింది మరి.
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే
మలబద్ధకం చాలా మందిలో ఉంటుంది. దీన్ని పెద్ద సమస్యగా భావించరు కూడా. కానీ ఇది గుండెజబ్బుకు దోహదం చేసే అవకాశముందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో 4 లక్షలకు పైగా మందిని పరిశీలించారు. వీరిలో 23,814 మంది మల బద్ధకం గలవారున్నారు. మలబద్ధకం లేనివారితో పోలిస్తే అది ఉన్నవారికి తీవ్ర గుండెజబ్బు వచ్చే అవకాశం రెట్టింపవుతున్నట్టు గుర్తించారు. అధిక రక్తపోటు గలవారికైతే ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉండటం గమనార్హం. అధిక రక్తపోటుతో ముడిపడిన గుండెజబ్బు ముప్పులను మలబద్ధకం మరింత ఎక్కువ చేస్తున్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫ్రాన్సిన్ మార్క్వెస్ చెబుతున్నారు.
Thanks @sarzberry for featuring our research on constipation and heart disease https://t.co/ts9EfT8QqI
— Prof Francine Marques (@FZMarques) August 25, 2024
Original paper 👇https://t.co/WyTpNydEDW
Trial info 👇https://t.co/BOi2M2u4dF
"మలబద్ధకంఅధిక రక్తపోటుతో సంబంధం ఉన్న హృదయనాళ ప్రమాదాలను మరింత తీవ్రతరం చేస్తుందని మా పరిశోధన సూచిస్తుంది, గుండెపోటు, స్ట్రోక్స్ సంభావ్యతను మరింత పెంచుతుంది. మా అధ్యయనం లో మలబద్ధకం- హృదయ సంబంధ వ్యాధుల మధ్య జన్యు సంబంధాలను కూడా పరిశీలించింది." - ప్రొఫెసర్ మార్క్వెస్
గుండెజబ్బు, మలబద్ధకం మధ్య జన్యుపరమైన సంబంధాలు కూడా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. పేగు, గుండె ఆరోగ్యాలను కలిపే యంత్రాంగాల మీద పరిశోధనలకు ఇది కొత్త ద్వారాలు తెరిచిందని భావిస్తున్నారు. ఈ పరిశోధనలో ప్రపంచ జనాభాలో 14% మంది గుండెజబ్జులకు మలబద్ధకం కారణమని తేలింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను మలబద్ధకం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. జనాభాలో గణనీయంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఇది పెంచవచ్చని నిర్ధారించారు.
శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్- ఈ లక్షణాలుంటే డేంజర్!
గుండెజబ్బు నివారణ, నియంత్రణకు పేగుల ఆరోగ్యం మీద దృష్టి సారించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు. చాలామంది రోజూ విరేచనం కాకపోతే మలబద్ధకంగా భావిస్తుంటారు. నిజానికి మూడు రోజులకు ఒకసారి విరేచనమైనా, రోజుకు మూడు సార్లు విరేచనాలైనా మామూలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
మలబద్ధకంపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ మార్క్వెస్ తాజా పరిశోధనలు, ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: Francine Marques