LANCET REPORT ON ANTIBIOTIC : చికిత్స లేని సూపర్‌బగ్స్ ప్రభావం వల్ల 2050 నాటికి దాదాపు 4 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనం లెక్కకట్టింది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (GRAM)లో ఈ వాస్తవాలు వెల్లడైనట్టు లాన్సెంట్ జర్నల్ ప్రచురించింది. ఎక్కువ మంది ఇన్‌ఫెక్షన్లకు, ప్రతీ చిన్న శరీర సమస్యకు యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడుతున్నారని గ్లోబల్ రీసెర్చ్‌లో తేలింది. దైనందిన జీవితంలో అవసరం లేని వ్యాధులకు కూడా యాంటీబయాటిక్స్‌ను వినియోగించడం సాధారణమైందని నివేదిక వెల్లడించింది. ఇలా అతిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం ప్రాణాంతకంతో పాటు ఇతర ట్రీట్‌మెంట్స్, సర్జరీలు కూడా కష్టతరమవుతాయి.
మీ చెవి చెప్పకపోతే అడుగు పడదని తెలుసా!- నడకలో ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్ - trouble in walking
ప్రపంచ వ్యాప్తంగా1990 నుంచి 2021 మధ్య యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ (AMR) కారణంగా 10 లక్షల మంది చనిపోయారని గోబ్లల్ రీసెర్చ్ అధ్యయనం లెక్కకట్టింది. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ వినియోగ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవితష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని లాన్సెంట్ ప్రచురించినలో గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్టీరియా, శిలీంద్రాలను చంపడానికి వాడే యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే క్రమంలో AMRగా రూపాంతరం చెందుతునట్లు గుర్తించారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారడం, ఇతర సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్‌ను మరింత సంక్షిష్టంగా మార్చుతుందని తేలింది.
సమాజంలో మనుషులు, జంతువుల్లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్ మితిమీరి వాడటం, దుర్వినియోగ పరచడం వల్ల ఈ భయంకర వాస్తవానికి మూలమని అధ్యయనంలో వెలుగు చూసింది. నిజానికి యాంటీమైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వాటిని కూడా ఎదుర్కోవడానికి బ్యాక్టీరియా, శిలీంద్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ (IHME) లీడర్ మోహసేన్ నాగవి పేర్కొన్నారు.
1990- 2021 మధ్య 70 ఏళ్లుపైబడిన వయస్కుల్లో యాంటీబయాటిక్ నిరోధకత వల్ల సంభవించే మరణాలు 80 శాతానికి పైగా ఉన్నాయని, ఐదేళ్లలోపు పిల్లలలో మరణాలు 50 శాతానికి పైగా తగ్గాయని అధ్యాయనం పేర్కొంది.
"ప్రపంచ జనాభాలో వయస్సు పెరిగేకొద్దీ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ నుంచి వృద్ధులకు ముప్పు పెరుగుతుంది. యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ వల్ల కలిగే ముప్పు నుంచి రక్షించుకోవడానికి చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది" అని ఇకుటా చెప్పారు.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా దక్షిణాసియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి భవిష్యత్తు మరణాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. 2025 - 2050 మధ్య మొత్తం 11.8 మిలియన్ల మరణాలు ఉంటాయని వెల్లడించారు. గ్లోబల్ రీసెర్చ్‌ను నిర్వహించే పరిశోధకు బృందం యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (GRAM) ప్రాజెక్ట్ కింద అధ్యయనం చేశారు.
204 దేశాలు అన్ని వయస్సుల నుంచి 520 మిలియన్ల మందికి సంబంధించిన వివరాలను ఆసుపత్రుల రికార్డులను విశ్లేషించారు. వీరి యాంటీబయాటిక్ వినియోగ సమాచారంతో సహా అనేక రకాల డేటాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.
ఇకపై కూడా ఇవే పరిమాణంలో యాంటిబయాటిక్స్ వాడకం కొనసాగితే 2050 నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లు ఉంటుందని లెక్క తేల్చారు. ఇది మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.83 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంతేకాదు, ప్రపంచ జీడీపీ 3.8 శాతం కోల్పోతుందని అధ్యయనం వివరించింది.
శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్- లక్షణాలపై అవగాహన తప్పనిసరి - mpox symptoms
నిలబడి నీళ్లు తాగుతున్నారా? - మీరు డేంజర్లో ఉన్నట్టే! - HOW TO DRINK WATER