Yami Gautam Pregnant :బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు యాడ్ షూట్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది, నెమ్మదిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఉల్లాసా ఉత్సాహా' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ, 'నువ్విలా' అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి ఆ తర్వాత 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కల్యాణ్' సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత బీటౌన్ వైపుకు అడుగులేసింది. 'కాబిల్', 'సర్కార్ 3', 'ఉరి', 'బాలా', 'భూత్ పోలీస్' లాంటి సినిమాల్లో మెరిసి బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది.
బీటౌన్‌లో సక్సెస్ఫుల్ స్టార్‌గా కొనసాగుతున్న సమయంలో ఆదిత్య ధర్ అనే డైరెక్టర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కూడా తన కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
అయితే తాజాగా యామీ తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. 'ఆర్టికల్ 370' అనే మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో తన భర్తతో కలిసి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. కాబోయే తల్లిదండ్రులకు నెట్టింట విషెస్ చెప్తున్నారు.